ఒకానొక వూళ్ళో, నలుగురు యువకులు యెంతో స్నేహంగా వుండేవారు. ఒకరంటే ఇంకొకరు ప్రాణమిచ్చేటట్లుగా వుండేది వాళ్ళ స్నేహం. ఒకసారి వారిలో వారు చర్చించుకుని, ' రాజధానికి వెళ్లి, గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసి ధనం సంపాదించి తిరిగివద్దాం. ' అని నిర్ణయించుకున్నారు.
అనుకున్నదే తడవుగా ఇంట్లోవారికి చెప్పి, కన్యాకుబ్జ౦ వెళ్లారు. అక్కడ పన్నెండు సంవత్సరాలు శ్రద్ధగా కష్టపడి చదువుకుని, ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యలో ప్రావీణ్యులయ్యారు. గురువుగారి దగ్గర శలవు తీసుకుని తిరిగి వారి వూరికి ప్రయాణమయ్యారు.
ఇంతవరకు బాగానే వున్నది.. వారి చదువును నిజ జీవితంలో ఏవిధంగా ఉపయోగించుకున్నారో యిక చూద్దాం.
నలుగురు యువకులు, ఒక వీధికూడలికి రాగానే, అక్కడనుండి యెటుపోవాలో ఆలోచిస్తూ, మొదటి యువకుడిని తన తర్కం వుపయోగించి చెప్పమన్నారు. అతడు ఏదో ఒక పుస్తకం లోనికి చూసి, ' నలుగురూ నడిచే దోవలో నడవమన్నారు పెద్దలు. ' అన్నాడు. ఆసమయంలోనే, కొందరు శవయాత్ర నిర్వహిస్తూ స్మశానం వైపు గుంపుగా వెళ్ళసాగారు. ఇంకేముంది ? మన యువకులు పుస్తకంలో చెప్పినట్లుగా నలుగురు నడుస్తున్నారు కదా అని వారితో పాటు స్మశానానికి చేరుకున్నారు.
ఆ తరువాత ఏం జెయ్యలో పాలుపోక, రెండవ యువకుడిని తన బుద్ధిని వుపయోగించి చెప్పమన్నారు. అతను కూడా ఏదో పుస్తకం తీసి, ' మనసంతోషంలో, దుఃఖంలో, అనారోగ్యంలో, విపత్కర సమయంలో, ఎవరు మనప్రక్కన వుంటారో వాడే నిజమైన మిత్రుడు. ' ఆని చదివి, వారి ప్రక్కన ఒక గాడిద వుండి వారి వైపే చూస్తూ ఓండ్ర పెడుతుంటే, దానిని ఆప్యాయంగా కౌగలించుకుని, ' ఇదే నిజమైన మిత్రుడు. ' అన్నాడు. వెంటనే మిగిలిన మిత్రులు కూడా దాని వీపునిమిరి తమ స్నేహభావం గాడిదపై ప్రదర్శించారు.

ఇంతలో, ఒక ఒంటె కూడా పరిగెత్తుకుంటూ వీరి వైపు రావడం చూసారు, ఆ యువకులు. వెంటనే మూడవ యువకుడు తన పుస్తకాన్ని చూసి, ధర్మమార్గం, అదృష్టం తమవైపు పరిగెత్తుకు వస్తున్నదని చెప్పాడు. వెంటనే, నాలుగవ యువకుడు, ' తెలివిగల వాడు తన స్నేహితులను ధర్మమార్గం వైపు దిశా నిర్దేశం చెయ్యాలి. ' అని చెప్పాడు.
అంతే ! ఆ మాటే శిరోధార్యంగా ఆ గాడిదను స్నేహితుడిగా భావించి, ధర్మదేవత లాంటి ఒంటెకు పరిచయం చేసారు, ఆ యువకులు. అంతటితో ఊరుకోకుండా, ఆ రెండింటినీ కలిపి కట్టేసారు.
ఇంతలో, ఆ గాడిద యజమాని అయిన రజకుడు, తన గాడిదను యెవరో యువకులు ఒంటెతో కట్టేసి లాక్కెళుతున్నారని విని, గబగబా అక్కడకు వచ్చాడు. అక్కడి పరిస్థితి చూసి, పెద్ద కర్ర పట్టుకుని, ఆ అమాయకపు నలుగురు యువకులను బాదడం మొదలు పెట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక నలుగురు యువకులూ అక్కడనుండి పరుగో పరుగు.
వారు కొద్ది దూరం పోగానే, ఒక నది వారికి కనబడింది. అందులో ఒక పెద్ద ఆకు కొట్టుకుని పోతుంటే, వారిలో ఒక యువకుడు పెద్దగా అరుస్తూ, ' ఆ ఆకును పట్టుకుంటే, మనం అవతల వడ్డుకు చేరటం ఖాయం. ' అని సలహా ఇచ్చాడు. అలా అంటూనే అతను, ఆ ఆకుమీదకు దూకి, సరాసరి నీటిలోకి జారిపోయాడు. రెండవ యువకుడు వాడి జుట్టు పట్టుకుని పైకి లేపుతుండగా, తన పుస్తక పరిజ్ఞానం గుర్తుకు వచ్చింది. ఏమని ! ' ఏదైనా వస్తువు సగం పాడైపోతుంటే, మిగిలిన దానిని కాపాడుకోవడానికి, పాడై పోయిన సగాన్ని త్యాగం చెయ్యాలి. ' అని.
ఇంకేముంది ? మిగిలిన ఇద్దరి సాయంతో, మొదటి వాడి దేహాన్ని రెండుగా అక్కడ దొరికిన పదునైన ఆయుధం తో కోసి. వాడి పై భాగాన్ని రక్షించామని అనుకున్నారు. ఆతరవాత, మిగిలిన ముగ్గురు యువకులూ అటూ ఇటూ తిరిగి ఒక గ్రామం చేరుకున్నారు.
వీరు చదువుకున్నవారిలా వున్నారని గ్రామస్తులు వారిని ఆదరించి, మూడు ఇళ్లల్లో వారిని ఉంచారు. అక్కడ ఆ మూడు ఇళ్ళవాళ్ళూ, వీరికి ప్రేమతో వేరు వేరు వంటకాలు వడ్డిస్తే, ఒక్కొక్క యువకుడు అతని పుస్తక పరిజ్ఞానంతో ఏదో వంకలు వెదికి, ఆ కమ్మని ఆహరం ముట్టుకోకుండా ఖాళీ కడుపులతో బయటకువచ్చి వీధినపడ్డారు.
ఆ విధంగా వారు 12 సంవత్సరాలు చదివిన చదువును సక్రమంగా అన్వయించి ఆచరణలో పెట్టుకోవడం చేతకాక, జీవన యాత్రలో ధనం సంపాదించలేక, వట్టి చేతులతో, అందరూ వీరిని పనికిమాలిన వారని హేళన చేస్తుండగా, తిరిగి వారి గ్రామానికి చేరుకున్నారు.
అంటే ఏమిటి జరిగిన విషయం ? చదివిన చదువును నిజజీవితంలో యెలా ఉపయోగించుకుని నలుగురికీ మేలు కలిగేరీతిలో ప్రదర్శిస్తూ, వారి అభిమానం చూరగొంటూ, సక్రమమార్గంలో ధనం సంపాదించాలని ఈ కథ చెబుతున్నది. ఆ పరిజ్ఞానం లేకపోతే, యెంత చదువు, యెంత కష్టపడి చదివినా, వృధాయే కదా !

Source: Gandavarapu Prabhakar
(Facbook)
No comments:
Post a Comment