Tuesday, 15 October 2019

శ్రీకృష్ణుని సందేశం - 4.1, మహాభారతం

పూర్వీకుల ఇష్టాలు, ఆశలు, మహత్తర కాంక్షలు, వైరాలు, పగలు - అవే  తరువాతి తరాలవారికి వారసత్వంగా మిగులుతాయి. తమ సంతానానికి సమస్త సుఖసంతోషాలు ఇవ్వాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు. వాస్తవానికి వారిచ్చేది తమ దురదృష్టాల ముల్లె మాత్రమే. వారివ్వాలనుకున్న అమృతంతో సంతానానికి వారు విషం నింపిన కలశాన్ని కూడా ఇస్తుంటారు. 

ఆలోచించండి ! మీ సంతానానికి మీరేమిచ్చారు నేటిదాకా? ఇచుండొచ్చు  ప్రేమ, జ్ఞానం, దానం ఇత్యాదులన్నీ. వారికి వీటితో పాటు వారి హృదయాన్ని మలినం చేసే మీ గతానుభవాల్ని ఇవ్వలేదా? మంచి చెడులంటూ మీరు నిర్ధారించుకున్న విలువల్ని ఇవ్వలేదా?

ఒకవ్యక్తి ఇంకొక వ్యక్తితో, ఒక సమాజానికి వేరొక సమాజంతో, ఒక రాజ్యానికి మరొక రాజ్యంతో సంఘర్షణ. ఇవన్నీ పూర్వ భ్రమల ఫలితాలు కాదంటారా? హత్య, మృత్యువు, రక్తపాతం ఇవన్నీ పూర్వానుభవాల ఫలితాలు కావా..?

అనగా తమ సంతానానికి తల్లిదండ్రులు జన్మదానంతో పాటుగా మృత్యుదానం కూడా ఇస్తుంటారు. ప్రకాశించే ప్రేమతో పాటు ద్వేషమనే అంధకారాన్ని కూడా ఇస్తుంటారు. అలాగే ఈ అంధకారం మనసులో ఉన్నా, ఆలోచనల్లో ఉన్నా లేదా వాస్తవికమే  అయినా దానివల్ల కేవలం భయమే ప్రాప్తిస్తుంది. కేవలం భయం. 

మూలం: శ్రీకృష్ణుని సందేశం, మహాభారతం 

No comments:

Post a Comment