Tuesday, 15 October 2019

శ్రీ కృష్ణుని సందేశం - 2.1, మహాభారతం

తమ కన్నబిడ్డల జీవితాల్లో సుఖసంతోషాలు నింపే ప్రయత్నం చేయడం తల్లిదండ్రులందరికీ ఉండవలసిన ప్రథమ కర్తవ్యమంటారు. ఎవరైతే మీవల్ల ఈ లోకంలోకి వచ్చారో వారి కర్మల ఫలితంతో భవిష్యత్ తరాలకి మీ గురించి కూడా తెలుస్తుంది. అందుకే వారి సుఖ సంతోషాల కోసం ప్రణాళికలు వేయడం కంటే ఉత్తమమైనది ఇంకేముంటుంది? అయితే సుఖం ఇంకా భద్రత ఇవి రెండు మానవుల కర్మ ఫలితాలు కావంటారా? మీ తల్లిదండ్రులు అందించిన మంచి లేదా చేదు సంస్కారం ఉపయోగకరమైన లేక నిరుపయోగకరమైన శిక్షణ ఈరోజు మీరు చేస్తున్న అన్ని పనులకు మూలం కాదంటారా? సంస్కారం, శిక్షణల తోనే మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అనగా తమ సంతానం యొక్క వ్యక్తిత్వాన్ని తల్లిదండ్రులు ఎలా అయితే మలుస్తారో, సంతానానికి అలాంటి భవిష్యత్తే ప్రాప్తిస్తుంది. అయినా చాలామంది తల్లిదండ్రులు తమ సంతానానికి భవిష్యత్తు లో భద్రతని చేకూర్చే ప్రయత్నంలో వారి వ్యక్తిత్వ వికాస భాధ్యతను మరచే పోతుంటారు. తల్లిదండ్రులు తమ సంతానం యొక్క భవిష్యత్ మాత్రమే బాగుండాలని కోరుకుంటే ఆ సంతానానికి ఎటువంటి ప్రయోజనము కలుగదు. అయితే తమ సంతానాన్ని ప్రేమించే తల్లిదండ్రులు వారి భవిష్యత్తుకి కాక వారి వ్యక్తిత్వానికి పునాదులు వేస్తే ఆ సంతానానికి యావత్ లోకం ప్రశంశలందిస్తుంది

మూలం: శ్రీ కృష్ణుని సందేశం, మహాభారతం 

No comments:

Post a Comment