Tuesday, 15 October 2019

శ్రీకృష్ణుని సందేశం - 3.1, మహాభారతం

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనిషి ప్రణాళికలన్నింటిని తునాతునకలు చేసేస్తుంటాయి. దాంతో మనిషి ఆ దురదృష్టానికి తన జీవితంలో కీలక స్థానం  ఇస్తాడు. మానవ భవిష్యత్తు అతని ప్రణాళికల ఆధారంగానే ఆవిర్భవిస్తుందా? కాదు. 

ఉదాహరణగా ఎత్తయిన ఒక పర్వతాన్ని ప్రప్రథమంగా అధిరోహించేవాడు దాన్ని అధిరోహించేముందు కొన్ని ప్రణాళికలు వేసుకోవచ్చు. అయితే ఆ ప్రళికాలే అతడిని ఆ పర్వత శిఖరానికి చేరుకొనేట్లు చేస్తాయా? లేదు. వాస్తవం ఏమిటంటే అతను ఆ పర్వతాన్ని అధిరోహిస్తున్నకొద్దీ అతనికి కొత్త కొత్త సమస్యలు, పరిస్థితులు, కొత్త కొత్త అవరోధాలు ఎదురౌతాయి. ముందడుగు వేస్తూ తన తరువాతి అడుగు గురించి నిర్ణయం తీసుకుంటాడు. అడుగడుగునా తన ప్రణాళికలు మార్చుకోవలసి వస్తుంది. పాత ప్రణాళికలు అతన్ని లోయలో పడవేయవచ్చు. అతడు పర్వతాన్ని తనకి అనువుగా మలచుకోలేడు. స్వయంగా తనను తాను  ఆ పర్వతానికి అనుగుణంగా మలచుకోగలడు. 
అయితే జీవిత యాత్రలో కూడా ఇలాగే  జరుగుతుందా? 
మనిషి తన జీవితంలో ఎదుర్కొనే కేవలం ఒక అవరోధాన్ని ఒక్క సమస్యనే తన జీవితానికి కేంద్రబిందువనుకొని తన జీవిత గతిని నిరోధిస్తే అతడికి జీవితంలో సాఫల్యం లభించదు. అలాగే అతనికి సుఖశాంతులు కూడా లభించవు. అంటే, జీవితాన్ని తనకు అనువుగా మార్చే బదులు స్వయంగా తనని తానూ జీవితానికి అనువుగా మార్చుకోవడమే సాఫల్యానికి, సౌఖానికి సమగ్రమైన మార్గం కాదంటారా...? 


మూలం: శ్రీకృష్ణుని సందేశం, మహాభారతం 

No comments:

Post a Comment