Tuesday, 15 October 2019

శ్రీ కృష్ణుని సందేశం - 1.1, మహాభారతం

ఇచ్ఛ, ఆశ, ఆపేక్ష, ఆకాంక్ష ... వీటి ఆలంబన తోనే మానవ జీవితం కొనసాగుతుంటుంది. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారనుకోండి మీరెవరు అని, దానికి మీ సమాధానం ఎలా  ఉంటుంది?
మీకు వెంటనే స్పష్టమౌతుంది మీ ఇచ్ఛలే మీ జీవితం గురించి వ్యాఖ్యానిస్తాయని. ఆశించింది పొందాక లభించే సఫలత లేదా దానిని కోల్పోయాక మిగిలే విఫలత - ఇదే మీ అస్తిత్వం. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే వారు కుంగి కృశించిపోతుంటారు. ఎందుకంటే వారు వారి ఇచ్ఛలని చంపుకోలేకపోతారు. ఇచ్ఛలు వారిని ఎలా నిర్దేశిస్తాయంటే మృగతృష్ణ కోసం మృగాల్లా పరుగులు తీస్తుంటారు. అయినప్పటికీ ఈ ఐహిక ఇచ్ఛల గర్భమే జ్ఞానామృతాన్ని ప్రసాదిస్తుంది. ఎలాగంటే ఇచ్ఛలు అసంపూర్ణంగా ఉన్న, నెరవేరకున్నా అప్పుడు అక్కడినుంచే జ్ఞాన కిరణాలు ఉత్పన్నమౌతాయి మానవుల అంతరాత్మ లో.

మూలం: శ్రీ కృష్ణుని సందేశం, మహాభారతం 

No comments:

Post a Comment