Tuesday, 15 October 2019

శ్రీకృష్ణుని సందేశం - 3.2, మహాభారతం

భవిషత్తుకి ఇంకొక పేరే 'సంఘర్షణ'. హృదయం లో ఏదైనా కోరిక జనించి అది అసంపూర్ణంగా మిగిలిపోతే ఆ హృదయం భవిష్యత్ ప్రణాళికలు వేస్తుంది. భవిష్యత్తులో తన కోరిక నెరవేరుతుందనుకొని కలలు కంటూ ఉంటుంది. కానీ జీవితం? జీవితం రానున్న భవిష్యత్ లోనూ ఉండదు, గతంలోనూ ఉండదు. జీవితమన్నది ఈ క్షణంలోనే ఉంటుంది. అనగా ఈ క్షణాన అనుభవించేదే జీవితానుభవం.

మనకి ఈ విషయం తెలిసినప్పటికీ ఈ చిన్న సూత్రాన్ని కూడా అర్థంచేసుకోలేము. గత స్మృతుల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతూ ఉంటాము లేదా రానున్న భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాము. కానీ జీవితం గడిచిపోతుంది. ఈ సత్యం మనలో నాటుకుపోవాలి.

మనం  భవిష్యత్తుని చూడనూలేము, రానున్న భవిష్యత్తుని నిర్మించనూలేము. మనం కేవలం ధైర్య సాహసాలతో భవిష్యత్తుని ఆలింగనం చేసుకోగలం. స్వాగతం పలుకగలం  ఆ భవిష్యత్తుకు. అలా చేస్తే జీవితం లోని ప్రతి క్షణం చైతన్యం తో నిండిపోదా?



మూలం: శ్రీకృష్ణుని సందేశం, మహాభారతం 

No comments:

Post a Comment