ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండవలసి వచ్చినప్పుడు ఒకరిపట్ల ఒకరు కొన్ని అవధులు, నియమాలు నిర్మించుకొనే ప్రయత్నం చేయడం సహజమే కదా.
మనం ఈ మానవ సంబంధాల గురించి ఆలోచించి చూస్తే ఈ సంబంధాలన్నింటికీ ఆధారం ఇలా ఇతరులకు మనం నిర్ణయించే అవధులే అని గుర్తిస్తాం. అయితే ఈ అవధులను ఎవరైనా అనుకోకుండా అతిక్రమిస్తే ఇక ఆ క్షణాన మన మనసంతా కోపంతో నిండిపోతుంది. ఈ అవధులు వాతావ రూపమేమిటన్నది ఎప్పుడైనా ఆలోచించారా?
అవధులు నిర్మించడం వాళ్ళ మనం ఎదుటివారికి నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వడంలేదు. మన నిర్ణయాలన్నీ ఇతరుల మీద మోపుతుంటాం. అంటే ఎదుటివారి స్వేచ్చని స్వీకరించలేకపోతున్నాం.
ఎప్పుడైతే ఒకరి స్వేచ్చని హరిస్తున్నామో అప్పుడు వారి హృదయం దుఃఖభరితమవుతుంది. ఎప్పుడైతే వారు అవధులు ఉల్లంఘిస్తారో అప్పుడు మన హృదయం కోపంతో నిండిపోతుంది.
అయితే ఒకరు ఇంకొకరి స్వేచ్చని ఎప్పుడైతే గౌరవిస్తారో ఇక వారికి ఏ అవధులు, నిబంధనల అవసరమే ఉండదు.
అంటే మనస్ఫూర్తిగా స్వీకరించడం అనేది ఆ బంధానికి దేహమైతే అలాంటి బంధానికి స్వేచ్ఛ ఆత్మ అవుతుంది.
No comments:
Post a Comment