మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి సదా భయానికి కారణాన్ని అన్వేషిస్తాడు. జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలని కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాం.
అయితే ఈ భయం వాస్తవికమేనంటారా? ఆలోచించండి.
భవిష్యత్తులో తనకు ఏదైనా ఆపద వస్తుందేమోనన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తుని నిర్దేశించేదెవరు? అది మన చేతుల్లోనే లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనే ఉండదు. భవిష్యత్తు ఈశ్వరాధీనంలోనే ఉంటుంది.
అయితే ఎవరైనా మీకు హాని తలపెట్టాలని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వారివల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా? లేదు.. కానీ భయంతో నిండియున్న మనస్సు మనకు ఎక్కువ హానికరం అవుతుంది. ఇది సత్యం కాదంటారా?
విపత్కర పరిస్థితిలో భయావహః హృదయం అనుచిత నిర్ణయాలు తీసుకుంటుంది. అది విపత్తుని అధిక బాధాకరం చేస్తుంది. కానీ విశ్వాసంతో నిండిన హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా అధిగమించగలదు . అనగా ఏ కారణం వాళ్ళ మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో, భయం సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్నిస్తుంది.
No comments:
Post a Comment