అధికార దాహం అందరి హృదయాల్లోనూ ఆవరించి ఉంటుంది. ప్రతివ్యక్తీ తనదంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ రాజ్యం కురు రాజ్యమంత పెద్దది కావచ్చు, లేకపోతే కుటుంబానికే పరిమితం కావచ్చు. తన అధికారాన్ని పొందే ప్రయత్నం మాత్రం అవశ్యం చేస్తాడు.
అయితే అధికారానికున్న వాస్తవిక రూపం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మనిషి ఎంతమంది జీవితాలను ప్రభావితం చేయగలడో, ఎంతమంది జీవితాల్లోని స్వేచ్ఛను అతను నియంత్రించగలడో అంత ఎక్కువ అధికారాన్ని అనుభవిస్తాడు.
నిజానికి అధికారానికున్న వాస్తవ స్వరూపం ఏమిటంటే అన్యుల జీవితంపై మనకున్న ప్రభావమే. కానీ వాస్తవమైన ప్రభావం ప్రేమ, దయ, కరుణ, ఇంకా ధర్మం నుంచి జనించేది కాదా? ఎప్పుడైతే మనిషి అధర్మంతో, కాఠిన్యం తో అధికారం పొందే ప్రయత్నం చేస్తాడో, అపుడు అతను ఇతరుల హృదయాల్లో విరోధానికి, విద్రోహానికి అంకురార్పణ చేస్తాడు. దాని పరిణామం కూడా అలాగే ఉంటుంది.
కొంతకాలం పాటు అతను బలసంపన్నుడు, శక్తిశాలి అని అపోహలో ఉంటాడు. కానీ అది నిజమైన అధికారం కాదు. ఈ కారణంగానే భృగువు, వశిష్ఠుడు వంటి ఋషులను ఈనాటికి పూజిస్తున్నారు. కానీ రావణుడిని, హిరణ్యకశిపుడిని కాదు. సత్యమే కదా...!!
No comments:
Post a Comment