ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం శ్రీ గురుభ్యోనమః`
ప్రథమాధ్యాయము.
అర్జున విషాదయోగః
పశ్యైతాం పాణ్డుపుత్రాణాం ఆచార్యమహతీమ్ చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవశిష్యేణ ధీమతా ||
పశ్య - చూడండి; ఏతాం - ఈ ; పాణ్డుపుత్రాణాం -పాండుపుత్రుల యొక్క ; ఆచార్య-ఓ గురువర్యా ; మహతీమ్ -గొప్పదైన ; చమూమ్ - సైన్యమును; వ్యూఢాం -వ్యూహముగా ఏర్పాటు చేయబడిన ; ద్రుపదపుత్రేణ - ద్రుపదపుత్రునిచే; తవ - మీ యొక్క ; శిష్యేణ - శిష్యుడు; ధీమతా - గొప్ప బుద్ధిమంతుడైన.
భావం: ఓ గురువర్యా, మీ బుద్ధికుశలుడైన శిష్యుడైన ద్రుపద పుత్రునితో వ్యూహముగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి.
భాష్యం: బ్రాహ్మణుడు, గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుల లోపాన్ని రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తిచూపే ప్రయత్నం చేసాడు. ద్రౌపది తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యులవారికి గతంలో రాజకీయ వైరం ఉంది. ఈ వైరం కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞం చేసి, ద్రోణాచార్యుని వధించగలిగే పుత్రుడిని వరంగా పొంది ఉన్నాడు. ద్రోణాచార్యులవారు ఈ విషయం తెలిసి కూడా ద్రుపద పుత్రుడైన ద్రుష్టద్యుమ్నునికి విశాల హృదయం కలిగిన బ్రాహ్మణుడిగా వ్యవహరించి అతనికి యుద్ధ రహస్యాలను బోధించారు. ఇప్పుడు యుద్ధరంగంలో ధృష్టద్యుమ్నుడు పాండవుల పక్షము లో ఉన్నాడు. ద్రోణాచార్యులవారి నుండి పొందిన విద్య తోనే అతను పాండవ సేనా వ్యూహాన్ని కూడా రచించాడు. ద్రోణాచార్యుల వారు సావధానులై రాజీ పడకుండా యుద్ధం చేయాలనే ఉద్దేశ్యంతో అతని ఈ తప్పుని దుర్యోధనుడు ఎత్తిచూపాడు . అదేవిధంగా తన ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధరంగంలో అతను మృదుస్వభావంతో ప్రవర్తించకూడదని తెలియచేయడం దుర్యోధనుని ఉద్దేశ్యం. ముఖ్యంగా అర్జునుడు ద్రోణాచార్యులవారికి ప్రియమైన మరియు తెలివిగల శిష్యుడు. యుద్ధరంగంలో అలాంటి కరుణా భావం తమ ఓటమికి దారితీసే అవకాశం ఉందని దుర్యోధనుడు హెచ్చరించాడు.
No comments:
Post a Comment