జీవితం లోని ప్రతిక్షణమూ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఇంక నిర్ణయం మాత్రం తన ప్రభావాన్ని వదిలే వెళ్తుంది.
నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో, దుఖానికో కారణం అవుతుంది. కేవలం తనకే కాదు. తన కుటుంబానికి, ఇంకా రానున్న తరతరాలకు కూడా.
ఏదైనా సందిగ్ధత ఏర్పడితే అప్పుడు మనసు వ్యాకులమవుతుంది. అతలాకుతలమైపోతుంది. నిర్ణయించుకున్న ఆ క్షణం యుద్ధమే అవుతుంది. ఇంక ఆ మనస్సు రణభూమిగా మారిపోతుంది.
సాధారణం గా మనం నిర్ణయాలు సందిగ్దతను నశింపచేయడానికి కాకుండాఆ కేవలం మనస్సుని శాంతిపచేయడానికే తీసుకుంటాం. అన్నట్టూ, ఎవరైనా పరిగెడుతూ భోజనం చేయగలరా..? లేదు.. అయితే యుద్ధానికై ఉర్రూతలూగే మనస్సు ఏదైనా సరైన నిర్ణయం తీసుకుంటుందా?
వాస్తవానికి శాంత మనస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది తమకోసం సుఖమయంగా భవిష్యత్తుని నిర్మిస్తుంది. కానీ తమ మనస్సుని శాంతిపచేయడానికి ఏదో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి భవిష్యత్తులో తన కోసం కంఠకభరితమైన వృక్షాన్ని నాటినట్లే.. ఆలోచించండి.
No comments:
Post a Comment