Sunday, 16 May 2021

శ్రీ కృష్ణ సందేశం 14. 2 మహాభారతం

సంప్రదాయం లో ధర్మం నివసిస్తుంది. అలాగే సంప్రదాయాలే  ధర్మాన్ని పరిరక్షిస్తుంటాయన్నదీ సత్యమే. మరైతే కేవలం సంప్రదాయాలే  ధర్మమా? ఆలోచించండి. 

వాస్తవానికి పాషాణంలో శిల్పం దాగి ఉంటుంది. అదే విధంగా సంప్రదాయంలో ధర్మం దాగి ఉంటుంది. కానీ పాషాణమే శిల్పం కాదు. శిల్పానికి ఆకృతినివ్వడానికి దాన్ని చెక్కవలసి ఉంటుంది. అనవసరమైన భాగాల్ని దూరం చేయక తప్పదు. 

సరిగ్గా అదే విధంగా సంప్రదాయంలో ధర్మాన్ని వెతికిపట్టుకోవాలి. అది ఎలా అంటే ఇంద్రపూజ అనే సంప్రదాయానికి దూరమై, గోవర్ధనగిరి పూజ అనే ధర్మాన్ని అనుసరించకపోతే యాదవులకు తమ ముక్తి మార్గం లభించివుండేది కాదు. 

అంటే సంప్రదాయాన్ని పూర్తిగా విడనాడేవారు ధర్మానికి దూరమవుతుంటారు. అలాగే సంప్రదాయాన్ని గుడ్డిగా అనుసరించేవారికి కూడా ధర్మ మార్గం ప్రాప్తించడం దుర్లభం. 

హంసకు నీరు-క్షీర న్యాయం తెలుసు అంటారు. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలనే గ్రహిస్తుంది హంస. అయితే సరైన ధర్మాన్ని తెలుసుకోవాలంటే హృదయంలో జ్ఞానం వాళ్ళ ప్రాప్తించిన వివేకం అవసరం కాదంటారా? ఇక అటువంటి వివేకం లేనప్పుడు దేనినైతే ధర్మం అని నమ్ముతారో అది వాస్తవంగా ధర్మం కాకపోవచ్చు. ఇది కూడా సంభవమేగా? మీరే ఆలోచించండి. 

No comments:

Post a Comment