ఎప్పుడూ తండ్రి తన పుత్రుడు సుఖపడాలనే కోరుకుంటాడు. వాని భవిష్యత్తు గురించే నిత్యం చింతిస్తూ ఉంటాడు. ఈ కారణం వల్లనే బహుశా తన సంతానం యొక్క భవిష్యత్తుకు మార్గాన్ని స్వయంగా తానే నిశ్చయించే ప్రయత్నాన్ని చేస్తుంటాడు.
తండ్రి తానూ ఏ మార్గాన నడిచాడో, ఏ మార్గంలోని సంకట పరిస్థితులను స్వయంగా చూశాడో, ఏ మార్గంలోని వెలుగు నీడలేని స్వయంగా చూశాడో, తెసులుసుకున్నాడో, అదే మార్గంలో పుత్రుని కూడా నడవమంటాడు. ఈ కొరికే ఉంటుంది ప్రతి తండ్రికీ. నిస్సందేహంగా ఉత్తమ భావనే ఇది.
అయితే ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మనం మర్చిపోతుంటాం.
మొదటిప్రశ్న: కాలంతో పాటుగా ప్రతి మార్గంలోనూ మార్పులు రావంటారా? కాలంతో పాటు కొత్త పరిస్థితులు ఎదుర్కొరంటారా? మరి గతించిన కాలం నాటి అనుభవాలు కొత్త తరానికి ఎలా ఉపయోగపడతాయి?
రెండవ ప్రశ్న: పిల్లలకు తమ తల్లిదండ్రుల దగ్గరినుంచి అన్నీ లభిస్తాయా?
హా. పిల్లలకు సంస్కారం నేర్పేది వారి తల్లిదండ్రులే. కానీ మనసులోని సమతుల్యం?
మనసులోని సమతుల్యం ఈశ్వరుడు ఇస్తాడు. ఏ మార్గాల్లో అయితే తండ్రికి సాఫల్యం లభించిందో అదే మార్గం.ఓ నడిచే వారి సంతానానికి సుఖము, సాఫల్యం లభిస్తాయని విశ్వసించగలరా?
చివరిప్రశ్న: జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు, సవాళ్ల వాళ్ళ ప్రయోజనం లేదంటారా?
ప్రతి ఒక్క కొత్త ప్రశ్న, సరికొత్త సమాధానానికి తెరతీయదంటారా? అయితే మరి సంతానాన్ని కొత్త కొత్త ప్రశ్నలు, సంఘర్షణలు, సవాళ్లకు దూరంగా ఉంచడం... దీనిని వాళ్లకి మంచి చేయడం అంటారా లేక హాని చేయడం అంటారా..?
అంటే ఏ ప్రకారంగా సంతానం యొక్క భవిష్యత్తును నిర్మించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపుదిద్దడం శ్రేష్టమో అదే విధంగా వారి జీవిత మార్గాన్ని నిశ్చయించడానికి మారుగా వారికి కొత్త కొత్త సంఘర్షణలు ఎదుర్కోవడానికి మనోబలం, విజ్ఞత అందించడం ఎక్కువ ప్రయోజనకరం కాదంటారా? ఆలోచించండి.
No comments:
Post a Comment