ఈ సృష్టి ఆరంభం నుంచే మనుషులను ఒక ప్రశ్న కలవరపెడుతోంది. తమ అనుబంధాలనుంచి ఎక్కువపాళ్లు సుఖం, అతి తక్కువపాళ్లు దుఃఖం పొందడమెలాగా అని.
ఈ లోకంలో ఉన్న మీ అనుబంధాలన్నీ మీకు సంపూర్ణ సంతోషాన్నిస్తున్నాయా..? ఆలోచించండి..
మనిషి జీవితం అనుబంధాలపై ఆధారపడుతుంది. వారి భద్రతాభావం కూడా అనుబంధాలపైనే ఆధారపడుతుంది. ఈ కారణం గానే మీ జీవితం లో సుఖసంతోషాలకు ఆధారం పూర్తిగా అనుబంధాలు.
అయినప్పటికీ మీకు ఈ అనుబంధాల మూలంగా అత్యధికంగా దుఃఖమెందుకు ప్రాప్తిస్తుంది?
సదా అలా సంఘర్షణలు సైతం అనుబంధాల మూలంగా ఎందుకు ఉత్పన్నమవుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా?
ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి ఆలోచనలు, లేదా అతని పనులు స్వీకరించలేనప్పుడు అతనిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే సంఘర్షణ మొదలవుతుంది.
అనగా తిరస్కారం ఎంత ఎక్కువవుతుందో సంఘర్షణ అంత ఎక్కువవుతుంది. అలాగే ఆమోదం అధికమైతే, ఆనందం కూడా అధికమవుతుంది. ఇది వాస్తవం కాదంటారా?
ఒక మనిషి స్వయంగా తన ఆపేక్షలపై అంకుశం పెట్టి తన అంతరంగాన్ని పరిశీలించి ఇంకెవరో వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మాని స్వయంగా తన ఎదలో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, అతనికి అనుబంధాల మూలంగా సంతోషం పొందడం అంత కఠినం కాదుగా..
అంటే ఆమోదమే మన అనుబంధాలకు నిర్వచనం కాదంటారా.. మీరే ఆలోచించండి.
No comments:
Post a Comment