జీవితంలోని సంఘర్షణలను ఎదుర్కొనే శక్తి తమ మనసుకు లేదని తలచే వారికి తమ ఆత్మబలం మీద విశ్వాసం ఉండదు. అప్పుడు వారు సద్గుణాలను త్యజించి దుర్గుణాలను అలవరచుకుంటారు.
యదార్థానికి మనిషి మనస్సులో ఆత్మవిశ్వాసం లోపించినప్పుడే వాని మనస్సులో దుర్మార్గం జనిస్తుందని గుర్తించాలి. ఆత్మవిశ్వాసమే సచ్చీలతను ధారణ చేస్తుంది.
ఈ ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి?. జీవితంలోని సంఘర్షణలు తమను నిర్వీర్యం చేస్తాయని నమ్మేవారు తమ ఆత్మవిశ్వాసాలన్నీ కోల్పోతారు. వారు సంఘర్షణలను అధిగమించడానికి మారుగా వాటిని వదిలించుకోవచాలనే ప్రయత్నం చేస్తుంటారు. అలా కాక సంఘర్షణలు తమని అధిక శక్తివంతం చేస్తాయని విశ్వసిస్తే, సరిగ్గా వ్యాయామం వాళ్ళ దేహ శక్తి పెరిగినట్లు ప్రతి ఒక్క సంఘర్షణతో పాటు వారిలో ఉత్తేజం పెరుగుతుంది.
అనగా ఆత్మవిశ్వాసం అంటే ఏదో కాదు. అది ఒక మానసిక స్థితి. జీవితాన్ని దర్శించే ఒక అద్భుత దర్పణం అది. అయినా జీవితాన్ని దర్శించగలిగే సామర్ధ్యం మనిషి వశం లో నే ఉంటుంది కదా.
No comments:
Post a Comment