మానవ స్వభావము ఏమిటంటే తనకు, తన కుటుంబానికి, తన సంతానానికి ఎప్పుడూ సుఖమే దక్కాలన్న ఆరాటం ఉంటుంది. ఈ కారణంగానే మనం సదా శ్రమకు, కష్టానికి దూరంగా ఉండాలనుకుంటాం. మన సుఖాన్ని, సౌకర్యాల్ని పెంచుకొనే ప్రయత్నం చేస్తుంటాం.
మీరు మీ జీవితం గురించి ఆలోచించండి. ఇది సత్యం కాదంటారా? మనం మన సంతానానికి సదా సుఖ సౌకర్యాలు కల్పించాలని ఆలోచిస్తుంటాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? కేవలం సుఖ సౌకర్యాలను పొందడం వల్ల వారి జీవితం ఎలా ఉంటుంది అని?
శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది. ఇది మనందరికీ అనుభవగతమే. బహుశా మనం ఇది మరచిపోతుంటాం. మనస్సుకు, ఆత్మకు బాధలు వచ్చినప్పుడే అవి మరింత బలవర్థకమవుతాయి.
అనగా మనం మన సంతానాన్ని శ్రమకు, కష్టానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించడం అంటే, నిజానికి వారు సుఖపడే మార్గాన్ని పూర్తిగా మూసివేయడం కాదంటారా? ఆలోచించండి.
No comments:
Post a Comment