ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం శ్రీ గురుభ్యోనమః`
ప్రథమాధ్యాయము.
అర్జున విషాదయోగః
4
ఆత్రశూరా మహేశ్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||
అత్ర - ఇక్కడ ; శూరా -శూరులు ; మహేశ్వాసా-గొప్ప ధనుర్ధారులు; భీమార్జున - భీమార్జునులకు ; సమాః - సమానమైనవారు ; యుధి -యుద్ధంలో ; యుయుధానః -యుయుధానుడు; విరాట-విరాటుడు; చ-కూడా; ద్రుపదః -ద్రుపదుడు; చ-కూడా ; మహారథః-మహారథుడైన
భావం: ఈ సైన్యములో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగిన శూరులైన ధనుర్ధారులు చాలా మంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు వంటి మహా యోధులు.
భాష్యం: యుద్ధవిద్య నందు ద్రోణాచార్యులవారి గొప్ప శక్తి వల్ల ధృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధం కాకపోయినా భయానికి కారణమైన వారు చాలా మంది ఉన్నారు. విజయాపథం లో వారు పెద్ద అవరోధాలని దుర్యోధనుడు ద్రోణాచార్యులవారికి తెలియజేస్తున్నాడు. వారిలో ప్రతిఒక్కరు భీమార్జునుల లాగే నిరోధింపశక్యం కానీ వారు కావడమే అందుకు కారణం. భీమార్జునుల శక్తి గురించి బాగా తెలియడం వల్లనే అతను ఇతరులను వారితో పోల్చి చూపించాడు.
No comments:
Post a Comment