ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం శ్రీ గురుభ్యోనమః`
ప్రథమాధ్యాయము.
అర్జున విషాదయోగః
సంజయ ఉవాచ
2. దృష్ట్వాతు పాణ్డవానీకం వ్యూఢమ్ దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||
సంజయ: ఉవాచ - సంజయుడు పలికాడు; దృష్ట్వా -చూచిన తరువాత; తు - కానీ; పాండవానీకం - పాండవుల సేనను ; వ్యూఢమ్ -వ్యూహముగా ఏర్పడియున్న దానిని ; దుర్యోధనః- దుర్యోధనుడు; తదా - అప్పుడు; ఆచార్యం - గురువును; ఉపసంగమ్య-సమీపించి; రాజా - ఓ రాజా ; వచనం - వచనములను; అబ్రవీత్ - పలికాడు.
భావం: సంజయుడు చెప్తున్నాడు: ఓ రాజా! పాండు పుత్రులచే వ్యూహంగా ఏర్పాటు చేయబడిన సైన్యమును చూసి, దుర్యోధనుడు తన గురువు వద్దకు వచ్చి ఈ విధంగా పలుకుతున్నాడు.
భాష్యం: దృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధర్మ విషయంలో తన పుత్రులు తనతో సమానంగా అంధులని అతనికి తెలుసు. పుట్టుకనుండీ ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందానికి రాలేరని అతనికి ఖచ్చితంగా తెలుసు. అయినా తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావం గురించి అతను సందేహితుడై ఉన్నాడు. యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ప్రశ్నించడంతో అతని అంతరార్ధాన్ని సంజయుడు అర్ధం చేసుకున్నాడు. అందుకే సంజయుడు నిరాశలో ఉన్న తన రాజును ఉత్సాహపరచడానికి పవిత్రస్తలం చేత ప్రభావితులై అతని పుత్రులు రాజీకి పడబోరని తెలియజేయసాడు. పాండవ సేనా బలాన్ని చూసిన తరువాత దుర్యోధనుడు పరిస్థితిని తెలియజేయడానికి వెంటనే సేనాధిపతియైన ద్రోణాచార్యుల వద్దకు వెళ్లాడని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. దుర్యోధనుడు రాజుగా చెప్పబడినా, పరిస్థితి తీవ్రతని అనుసరించి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసివచ్చింది. అందుకే, రాజకీయవేత్త అనడానికి అతను తగినవాడు. కానీ పాండవ సేనా వ్యూహాన్ని చుసిన తరువాత అతను పొందిన భయాన్ని ఆ రాజనీతి నిపుణత తగ్గించలేకపోయింది.
No comments:
Post a Comment