Monday, 31 May 2021

Day-12 Radheshyam Prabhu Bhagavadgita

 Why do we need Guru?

Arjuna in dilemma whether to fight or not. Surrenders to Krishna and prays to direct him. (2.7) 

Arjuna: I have developed weakness of my nature and no desire to fight in the battle as his relatives will die. Mind is bewildered about my duty. I surrender to you as disciple and direct me to

Man in material perplexity: One who doesn't understand problems of life. Compared to animals. Miserly man who does not solve the problems of life. 

Every living being renders some service to other but it is terminated with death. Relationships in material world are temporary. 

Dharma of any substance is its innate nature. Dharma of soul is to serve God with unconditional love. 

God is eternal, soul is eternal. Therefore loving relationship between the two is eternal. That eternal love and service to God is called 'SANATANA DHARMA'

Having forgotten God, we are reposing the love and service in temporary relationship in the world. and became spouse centred, work centred, money centred, pet centred, family centred but in reality we should develop God centredness. 

We need to approach Guru to overcome perplexity. When we are attached to material world, we posses perplexities like angry, jealous, greedy, insulting others and develop no peace to the soul. 

How to approach guru:

With attitude of doing service to guru, should take shelter of guru and learn to overcome perplexities. 

BG. 2.8: Arjuna says, even he gets kingdom he wouldn't want to fight the war and requests krishna to guide him in right way as guru being completely surrendered. 

Surrendering to Krishna, the Sat-Cid-Aananda rupa is really an intelligent move. 

BG.2.9: Sanjaya disappoints Dritarashtra by declaring Arjuna as competent to kill the enemies. He informs Dritarashtra that he was in dilemma temporarily and now he is surrendered to Krishna and would fight soon. 

3 effects of surrender which manifest in Arjuna: 

1. Enlightenment

2. Freedom from false lamentation

3. Reinstatement in his own duty

BG.2.10 : Krishna starts speaking - Sanjaya reports that Krishna smiling  because a friend had chosen to become a disciple. in the midst of both armies. 

Bhagavadgita is openly discussed between the two armies. Therefore this knowledge is not for particular person, community or society, but for everyone. Friends and enemies both are entitled to gain the knowledge. 



Sunday, 30 May 2021

Day-11 Radheshyam Prabhu Bhagavadgita

 Put Principles before Pleasure:

(2.11-30)

Arjuna's Question: Compassion 

Krishna's Answer: We are not body. Soul keeps on attaining other bodies after death till it gets purification

(2.31-37)

Arjuna: How can it be enjoyment after this violence

Krishna: Kshatriyas will die in battle and attain heaven. How cannot be enjoyment later

(2.33, 38-53)

Arjuna: Fear of Sin

Krishna: You are acting on the order of lord. Not for your personal benefits. You are here for Dharmasamsthapana. devotional duty is free from Sin

(2.45-46, 3.24)

Arjuna: Destruction of family tradition

Krishna: Be a role model to prevent varna sankara . Yudishtir Maharaj will protect all widows of kshatriyas treating them like mothers. Dharma will be up hold

(Duryodana, Shakuni, Dushasana, Karna- Dushta Chatushtayam)

2.41

Arjuna: Indecision

Krishna: Serve the lord with firm determination. Don't hesitate doing your duty. 


Chapter -1: Arjuna presents all reasons not to fight in battle. 

Chepter-2: 

Section  I(2.1-2.10) - Arjuna's further doubts and surrenders to Krishna

Section II (2.11-2.30) - (Jnana -Fight) There is no death for the soul. The body can never be saved. 

Section III (2.31-2.38)- (Karma-Kanda- Fight!) Karma-Kanda consciousness, by performing prescribed duties, gain material enjoyment. 

Section IV (2.39-2.59) Buddhi Yoga): Combination of Karma and Yoga, Nishkaama Karma Yoga. not to be attached to results. Work on Lord's name. 

Section V: (2.54-2.72): Stita Prajna - Samadhi. Material detachment and equipoised platform of liberation called Samadhi

Characters: 

Duryodhana: Not caring for scriptures and god, acting selfishly for becoming an unrivalled king. 

Arjuna: Own idea of protecting bodies of sinful aggressors and showing false compassion on 'dress of a drowning man'. Giving up duty which is painful, Ignorance without self realization. Lamenting for gross body not caring for soul.

PRINCIPLE: Stick to duty ordained in scriptures as ordered by God.

Sanjaya says:

By calling Krishna as "Madhusudhana" Sanjaya informs Dritarashtra that Arjuna's doubts will now be killed. 

Dritarashtra was happy to hear that Arjuna dropped his bow and sure about his sons' victory. 

Purport: Signs of ignorance of self realization - Material compassion, lamentation an shears. 

Chapter-2: Janana - Analytical study of material body and sprit soul by supreme authority, Lord Krishna. Same body but soul is gone. 

Krishna Says, 2.3:

 Krishna Condemns by following words: Non Aryan (2.2), Kasmalam-implies impurities (2.2), Klaibhyam-implies impotent(2.3), Hridaya daurbhalyam-implies weakness of heart(2.3)

Definition of Aryan: Civilized class of men knowing value of life and have civilization based on self realization

Non Aryan: Don't know the aim of life is Vishnu, What is liberation from material bondage. Their conception of life is led by material conception, captivated by external features of material world

Example of non-Aryan activity is Arjuna being Kshatriya and not doing his duty out of false compassion

Kasmalam(Impurities): Lord expresses exclamation 'where from'

Klaibhyam(Impotent): Don't be cowards

Hridaya Daurbhalyam: False copassion. 

Krishna is referred to as Bhagavan: Krishna is source of all incarnations. Supremely attractive. Has six opulences. Beauty, wealth, knowledge, Fame, Strength and renunciation.

Being part and parcel of him, we too do posses few of such qualities. 

Bhaga=Opulence=One who posses. 

Arjuna quotes dharma for facing Bhishma and Drona who are worth worshipping. He compares Dharma sastra with Artha Sastra and supports Dharma sastra. 

But spiritual activities are beyond both as Lord Krishna says.





_*💫 నమ్మకం పోయింది..!! 🎊*_

_శిష్యుడు- గురువుగారూ, నేనింక ఈ మంత్రం జపం చేయను._

_గురువు- ఏమైంది నాయనా ?_

_శిష్యుడు- రోజూ క్రమం తప్పకుండా చేస్తున్నాను. ఇంతవరకూ ఏం ఫలితం దొరకలేదు._

_గురువు- ప్రారంభించి ఎంత కాలమైంది ?_

_శిష్యుడు- నెల రోజులైంది. భగవన్నామం ఒక్కసారి చేస్తే చాలు పాపాలన్నీ పోతాయన్నారు.. మరి నాకు రవంత ప్రశాంతతైనా దొరకదేంటి ? మంత్రంలో బలం ఉంటే పని చేయాలి కదా ! కనీసం కాస్తైనా నా లోపలి బరువు తగ్గాలి కదా !_

_గురువు- ఓర్పు పట్టాలి నాయనా. తప్పక కలుగుతుంది. ఇట్టివి నెమ్మదిగా పని చేస్తాయి, కానీ తప్పక పని చేస్తాయి. నీకిచ్చినది మహామంత్రం._

_శిష్యుడు- లేదండి. రోజూ శుచిగా ముప్పూటలా స్నానాలు చేస్తాను. సమస్త నియమాలు పాటిస్తూ, ఏకభుక్తం చేస్తూ, మౌనవ్రతం కూడా అవలంబిస్తూన్నాను. పగలు పడుకోను. చాప మీద పడుకుంటాను. ఎక్కువ మాట్లాడను. అరిషడ్వర్గాలకు లోనవ్వటం లేదు. ఇంద్రియాల తృప్తికోసం జీవించటం మానేశాను._

_గురువు- నాకు తెలుసు నాయనా. నీలో చాలా మార్పు ఉంది. ఇతరత్రా భూమిక సిద్ధమవుతున్న సూచన స్పష్టంగానే కనిపిస్తున్నది. ఫలితం గురించి ఇప్పుడే చూడకు. నీకు కనిపించని స్థితిలో అది పని చేస్తుంది._

_శిష్యుడు- లేదండి. నాకు పూర్తిగా నమ్మకం పోయింది. నేను వదిలేస్తాను. వదలాలంటే ఏంచేయాలో చెప్పండి._ 

_గోవు చెవులో ఊదటమో ఏదో పద్ధతులుంటాయి కదా !_

_గురువు- సరే- తప్పక చెప్తానవి. కానీ ముందు నువ్వొక పని చేయి. ఈ మామిడి టెంక మన ఆశ్రమం పెరట్లో నాటి రా. వచ్చి రేపు కనిపించు._

_శిష్యుడు- అట్లాగేనండి._

_(నాటి వెళ్ళి, మరునాడు వచ్చాడు)_

_శిష్యుడు- మంత్రం విడిచే మార్గం చెప్పండి._

_గురువు- నువ్వు నిన్న నాటిన టెంక నాటుకుందా, చూశావా ?_

_శిష్యుడు- లేదండి, నిన్ననే కదా పెట్టింది._

_గురువు- సరిగ్గా పెట్టావా, లోతుగా తవ్వావా, మట్టి పూర్తిగా కప్పావా ?_

_శిష్యుడు- “ఆఁ.. అన్నీ సరిగ్గానే చేశానండి. సూర్యరశ్మి తగిలే చోటే పెట్టాను. వేరే చెట్టు ఛాయలో కాక విడిచోటే పెట్టాను. తగినంత నీరూ పోశాను. ఇవాళ లోపలకు వస్తూ కూడా నీళ్ళు పోశాను._

_గురువు- అయినా పండు రాలేదా ?_

_శిష్యుడు- అదేంటండి, టెంక నాటుకోవాలంటే సమయం పడుతుంది కదా. అది మొక్కై, చెట్టై, పూసి కాస్తే కదా పండొచ్చేది ?_

_గురువు- నిజమే. కానీ టెంకలో బలం లేదేమో..! లేకపోతే ఈ పాటికి కనీసం చిన్న పిలకైనా బయటకు కనిపించాలి కదా._

_శిష్యుడు- లేదండి. అది మట్టిలో మొదలు ఇమడాలి. దానిలో ఉన్న నాటుకునే శక్తి చైతన్యవంతం కావాలి. చాలా సమయం పడుతుంది._

_గురువు- అవన్నీ నిజమే. కానీ ఇన్ని గంటలైంది కదయ్యా. నాకు నమ్మకం పోయింది. అదింక నాటుకోదేమో..!_

_[శిష్యుడు ఏదో అర్థమైనట్టు తలవంచుకున్నాడు]_

_గురువు- దాన్ని తవ్వితీసి పెరికి అవతలపారేసేయి.. నేనింక ప్రతీక్షించలేను. పో._

_శిష్యుడు- నాకు మీ సమాధానం అర్థమైందండి. ఇంకెప్పుడూ మంత్రం చేయనని వదిలేస్తానని అనను. క్షమించండి..🙏_

🙏🇮🇳😷🥦🔮💉🎊💫🪴

సేకరణ (రచయిత పేరు దొరకలేదు)

రచయిత ఎవరైనా, ఇంత గొప్పగా రాసినందుకు ధన్యవాదాలు. 


Tuesday, 25 May 2021

శ్రీ కృష్ణ సందేశం 22. 1 మహాభారతం

అంకితభావంతోనే సదా జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ అంకితభావంతో ఉన్న గొప్పదనం ఏంటి? ఇదెప్పుడైనా మనం ఆలోచించామా? 

జ్ఞాన ప్రాప్తికి సదా మనిషి మనస్సు విభిన్న సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది. ఒకసారి ఇతర విద్యార్థుల పట్ల ఈర్ష్య కలిగిస్తుంది. ఇంకొకసారి నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగిస్తుంది. మరొకసారి గురువు వేసిన శిక్ష వలన మనసును అహంకారంతో నింపేస్తుంది. కాదా? ఇలా జరగదంటారా? 

ఎవరికీ తెలుసు ఎన్ని రకాల ఆలోచనలు మనసును కలవరపెడతాయో, మనస్సులో కలిగే ఇటువంటి అనిశ్చిత స్థితి కారణంగా మనం జ్ఞానాన్ని పొందలేకపోతుంటాం. 

మనస్సుకు నిశ్చల స్థితి కేవలం అంకితభావంతోటే  వస్తుంది. అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది. ఈర్ష్య, వ్యామోహం వంటి భావనలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనస్సుకు ఏకాగ్రతనిస్తుంది. 

వాస్తవానికి ఈశ్వరుని సృష్టిలో జ్ఞానానికి అవధి లేదు. జ్ఞానులకూ లేదు. దత్తాత్రేయులవారు ఆనాడు గోవు నుంచి, శునకం నుంచి కూడా జ్ఞానాన్ని సంపాదించారు. 

అనగా విషయం  బ్రహ్మజ్ఞానం కావచ్చు, లేక లోక జ్ఞానం కావచ్చు, లేక గురుకులంలో పొందే జ్ఞానమూ కావచ్చు. దాన్ని పొందడానికి గురువుకన్నా అధిక ప్రాధాన్యం ఆ గురువు పట్ల మనకున్న అంకితభావానిదే. ఇది సత్యం కాదనగలరా? మీరే ఆలోచించండి. 


శ్రీ కృష్ణ సందేశం 21. 1 మహాభారతం

ఈ జగత్తులో జన్మించే ప్రతి శిశువు ఎటువంటి గుణ దోషాలు లేకుండా జన్మిస్తాడు. వాని అంతరాత్మలో ఎటువంటి సత్సంస్కార లక్షణాలు గాని, దుస్సంస్కార లక్షణాలు గాని ఉండవు. అనగా జన్మతః పిల్లలలో ఎటువంటి గుణాలు గాని, దోషాలు కానీ ఉండవు. అయితే ఈ గుణదోషాలన్నవి ఏ విధంగా ప్రాప్తిస్తాయంటారు?

తమ తల్లిదండ్రుల నోట నిరంతరం వినే మాటల యొక్క ప్రభావమే వారి సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది. ఎలాగంటే, గ్రామం లోని నదికి వెళ్లే మార్గంలో జనం పడే పడే నడవడం వాళ్ళ ఒక కాలిబాట ఏర్పడుతుంది. అనగా, అమ్మా నాన్నల మనస్సులోని కోరికలే వారి సంతానానికున్న సంస్కారంలోని దోషం లేదా గుణమై ప్రతిఫలిస్తాయి. ఇది సత్యం కాదంటారా?

అయినప్పటికీ తమ సంతానంలో ఏదైనా దోషం కనిపించినప్పుడు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో, దుఃఖంతో దిగ్భ్రాంతులవుతారు. వారి హృదయం వారిని నిలదీసి ప్రశ్నిస్తుంది. తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చింది అని. 

సత్యమేమిటంటే పిల్లలలో తల్లిదండ్రులు అనాలోచితంగానే అయినా కుసంస్కార బీజాలను నాటుతుంటారు. అవి వారి పిల్లల మనోఫలకం మీద కుసంస్కార వృక్షాలై పెరుగుతాయి. 

అనగా తమ సంతానం సంస్కారవంతంగాను, ధర్మబద్ధంగాను ఉండాలని ఆశించే ప్రతి తల్లి, తండ్రి ముందుగా తమ మనస్సులోని కోరికలను నియంత్రించుకోవడం అనివార్యం కదా. ప్రతి తల్లి, తండ్రి ఈ విషయం గురించి అవశ్యం ఆలోచించాలి. 

శ్రీ కృష్ణ సందేశం 21. 2 మహాభారతం

మానవ స్వభావము ఏమిటంటే తనకు, తన కుటుంబానికి, తన సంతానానికి ఎప్పుడూ సుఖమే దక్కాలన్న ఆరాటం ఉంటుంది. ఈ కారణంగానే మనం సదా శ్రమకు, కష్టానికి దూరంగా ఉండాలనుకుంటాం. మన సుఖాన్ని, సౌకర్యాల్ని పెంచుకొనే ప్రయత్నం చేస్తుంటాం. 

మీరు మీ జీవితం గురించి ఆలోచించండి. ఇది సత్యం కాదంటారా? మనం మన  సంతానానికి సదా సుఖ సౌకర్యాలు కల్పించాలని ఆలోచిస్తుంటాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? కేవలం సుఖ సౌకర్యాలను పొందడం వల్ల  వారి జీవితం ఎలా ఉంటుంది అని?

శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది. ఇది మనందరికీ అనుభవగతమే. బహుశా మనం ఇది మరచిపోతుంటాం. మనస్సుకు, ఆత్మకు బాధలు వచ్చినప్పుడే అవి మరింత బలవర్థకమవుతాయి. 

అనగా మనం మన  సంతానాన్ని శ్రమకు, కష్టానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించడం అంటే, నిజానికి వారు సుఖపడే మార్గాన్ని పూర్తిగా మూసివేయడం కాదంటారా? ఆలోచించండి. 


1.10 ప్రథమాధ్యాయము; అర్జున విషాదయోగః

ఓం నమో భగవతే వాసుదేవాయ 

ఓం శ్రీ గురుభ్యోనమః`

ప్రథమాధ్యాయము. 

అర్జున విషాదయోగః

10

అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః | 

నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదా: || 

అన్యే-ఇతరులు; చ-కూడా; బహవః -బహు సంఖ్యలో ; శూరా-వీరులు; మదర్థే-నాకోసం; త్యక్తజీవితాః -జీవితాన్ని కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడినవారు; నానా శస్త్ర ప్రహరణాః -అనేకరకాలైన ఆయుధాల్ని ధరించినవారు; సర్వే -అందరూ ; యుద్ధవిశారదా:-యుద్ధ నైపుణ్యం కలిగినవారు. 

 భావం: నాకోసం తమ జీవితాల్ని త్యాగం చేయడానికి సద్దపడిఉన్న వీరులు ఇంకా చాలామంది ఉన్నారు. వారందరూ అనేక రకాలైన ఆయుధాల్ని ధరించినవారు, యుద్ధ నైపుణ్యం కలిగినవారు. 

భాష్యం: జయద్రదుడు , కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు కూడా దుర్యోధనుని కోసం తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకోవిధంగా చెప్పాలంటే, అధర్మపరుడైన దుర్యోధనుని పక్షం లో ఉన్నందువల్ల కురుక్షేత్రంలో వారంతా మరణిస్తారని ముందే నిర్ణయింపబడింది. కానీ దుర్యోధనుడు మాత్రం తన మిత్ర శక్తి వాళ్ళ తనకి విజయం అవశ్యం లభిస్తుందని ధైర్యంతో ఉన్నాడు. 

Sunday, 23 May 2021

1.8 ప్రథమాధ్యాయము; అర్జున విషాదయోగః

ఓం నమో భగవతే వాసుదేవాయ 

ఓం శ్రీ గురుభ్యోనమః`

ప్రథమాధ్యాయము. 

అర్జున విషాదయోగః 

8

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః | 

అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ || 

భవాన్ -మీరు; భీష్మ -భీష్మ పితామహుడు ; చ-కూడా; కర్ణ: - కర్ణుడు; చ-మరియు; కృపః - కృపుడు, అశ్వత్థామ -అశ్వత్థామ, వికర్ణ: - వికర్ణుడు, చ-కూడా; సౌమదత్తి - సోమదత్తుని కుమారుడు; తథా - అలాగే ; ఏవ-నిశ్చయంగా ; చ-కూడా. 

భావం: యుద్ధంలో ఎప్పుడూ విజయం సాధించే మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు లాంటి వారు మన సైన్యంలో ఉన్నారు. 

భాష్యం: యుద్ధరంగంలో నిత్యం విజయశీలురైన ప్రముఖ వీరులను దుర్యోధనుడు పేర్కొంటున్నాడు . వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యులవారి పుత్రుడు. సోమదత్తుడు (భూరిశ్రవుడు) బాహ్లికరాజు పుత్రుడు. పాండు రాజుతో వివాహానికి పూర్వం కుంతీ దేవికి సూర్య భగవానుని వరప్రసాదంగా కర్ణుడు జన్మించాడు. కాబట్టి అతను అర్జునునికి సోదరుడు.  కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యులవారి  భార్య.    

Saturday, 22 May 2021

1.7 ప్రథమాధ్యాయము; అర్జున విషాదయోగః

ఓం నమో భగవతే వాసుదేవాయ 

ఓం శ్రీ గురుభ్యోనమః`

ప్రథమాధ్యాయము. 

అర్జున విషాదయోగః 

7

అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ | 

నాయకా మామ సైన్యస్య సంజ్ఞార్థం తాం బ్రవీమితే || 

అస్మాకం-మన యొక్క; తు-కానీ; విశిష్టా: - ప్రధానంగా శక్తివంతులైనవారు; యే -ఎవరో; తాన్ -వారిని; నిబోధ-గుర్తించండి; ద్విజోత్తమ -ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా; నాయకాః -నాయకులు; మమ -నా యొక్క; సైన్యస్య-సేనల; సంజ్ఞార్థం-తెలియడానికి; తాన్ -వారిని గురించి ; బ్రవీమి - తెలుపుచున్నాను; తే -మీకు. 

భావం: కానీ ఓ బ్రాహ్మణోత్తమా! నా సేనాబలాన్ని నడపడానికోసం ప్రత్యేకంగా యోగ్యులైన నాయకుల గురించి మీకోసం నేను తెలియజేస్తున్నాను.  

Friday, 21 May 2021

1.6 ప్రథమాధ్యాయము; అర్జున విషాదయోగః

ఓం నమో భగవతే వాసుదేవాయ 

ఓం శ్రీ గురుభ్యోనమః`

ప్రథమాధ్యాయము. 

అర్జున విషాదయోగః 

6

యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ | 

సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా|| 

యుధామన్యు: - యుధామన్యుడు; చ -మరియు; విక్రాన్త -పరాక్రమవంతుడైన; ఉత్తమౌజా:-ఉత్తమౌజుడు;  చ-మరియు; సర్వే -అందరును; ఏవ-నిశ్చయముగా; మహారథా : - మహారథులు. 

భావం: పరాక్రమవంతుడైన యధామన్యుడు , శక్తిశాలియైన ఉత్తమౌజుడు, సుభద్రతనయుడు, ద్రౌపది పుత్రులు ఆ సైన్యం లో ఉన్నారు.. వీరందరూ మహారథులు. 


Thursday, 20 May 2021

శ్రీ కృష్ణ సందేశం 19. 2 మహాభారతం

అధికార దాహం అందరి హృదయాల్లోనూ ఆవరించి ఉంటుంది. ప్రతివ్యక్తీ తనదంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ రాజ్యం కురు రాజ్యమంత పెద్దది కావచ్చు, లేకపోతే కుటుంబానికే పరిమితం కావచ్చు. తన అధికారాన్ని పొందే ప్రయత్నం మాత్రం అవశ్యం చేస్తాడు. 

అయితే అధికారానికున్న వాస్తవిక రూపం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మనిషి ఎంతమంది జీవితాలను ప్రభావితం చేయగలడో, ఎంతమంది జీవితాల్లోని స్వేచ్ఛను అతను నియంత్రించగలడో అంత ఎక్కువ అధికారాన్ని అనుభవిస్తాడు. 

నిజానికి అధికారానికున్న వాస్తవ స్వరూపం ఏమిటంటే అన్యుల జీవితంపై మనకున్న ప్రభావమే. కానీ వాస్తవమైన ప్రభావం ప్రేమ, దయ, కరుణ, ఇంకా ధర్మం నుంచి జనించేది కాదా? ఎప్పుడైతే మనిషి అధర్మంతో, కాఠిన్యం తో అధికారం పొందే ప్రయత్నం చేస్తాడో, అపుడు అతను  ఇతరుల హృదయాల్లో విరోధానికి, విద్రోహానికి అంకురార్పణ చేస్తాడు. దాని పరిణామం కూడా అలాగే ఉంటుంది. 

కొంతకాలం పాటు అతను బలసంపన్నుడు, శక్తిశాలి అని అపోహలో ఉంటాడు. కానీ అది నిజమైన అధికారం కాదు. ఈ కారణంగానే భృగువు, వశిష్ఠుడు వంటి ఋషులను ఈనాటికి పూజిస్తున్నారు. కానీ రావణుడిని, హిరణ్యకశిపుడిని కాదు. సత్యమే కదా...!! 

1.5 ప్రథమాధ్యాయము; అర్జున విషాదయోగః

 ఓం నమో భగవతే వాసుదేవాయ 

ఓం శ్రీ గురుభ్యోనమః`

ప్రథమాధ్యాయము. 

అర్జున విషాదయోగః 

5

దృష్టకేతు శ్చేకితానః కాశీ రాజశ్చ వీర్యవాన్ | 

పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః || 

ధృష్టకేతు - ధృష్టకేతువు; చేకితానః - చేకితానుడు; కాశీరాజ:-కాశీరాజు; చ-కూడా; వీర్యవాన్ - శక్తిమంతుడైన ; పురుజిత్ - పురుజిత్తు; కుంతిభోజ-కుంతిభోజుడు; చ-మరియు ; శైబ్య-శైబ్యుడు ; చ-మరియు; నరపుంగవః -నరులలో శ్రేష్ఠుడైన. 

భావం: ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోధులును అటువైపు ఉన్నారు. 


Wednesday, 19 May 2021

1.4 ప్రథమాధ్యాయము; అర్జున విషాదయోగః

 ఓం నమో భగవతే వాసుదేవాయ 

ఓం శ్రీ గురుభ్యోనమః`

ప్రథమాధ్యాయము. 

అర్జున విషాదయోగః 

4

ఆత్రశూరా మహేశ్వాసా భీమార్జునసమా  యుధి | 

యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః || 

అత్ర - ఇక్కడ ; శూరా -శూరులు ; మహేశ్వాసా-గొప్ప ధనుర్ధారులు; భీమార్జున - భీమార్జునులకు ; సమాః - సమానమైనవారు ; యుధి -యుద్ధంలో ; యుయుధానః -యుయుధానుడు; విరాట-విరాటుడు; చ-కూడా; ద్రుపదః -ద్రుపదుడు; చ-కూడా ; మహారథః-మహారథుడైన 

భావం: ఈ సైన్యములో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగిన శూరులైన ధనుర్ధారులు చాలా మంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు వంటి మహా యోధులు. 

భాష్యం: యుద్ధవిద్య నందు ద్రోణాచార్యులవారి  గొప్ప శక్తి వల్ల  ధృష్టద్యుమ్నుడు ముఖ్యమైన అవరోధం కాకపోయినా భయానికి కారణమైన వారు చాలా మంది ఉన్నారు. విజయాపథం లో వారు పెద్ద అవరోధాలని దుర్యోధనుడు ద్రోణాచార్యులవారికి తెలియజేస్తున్నాడు. వారిలో ప్రతిఒక్కరు భీమార్జునుల లాగే   నిరోధింపశక్యం కానీ వారు కావడమే అందుకు కారణం. భీమార్జునుల శక్తి గురించి బాగా తెలియడం వల్లనే అతను ఇతరులను వారితో పోల్చి చూపించాడు. 

Tuesday, 18 May 2021

1.3 ప్రథమాధ్యాయము; అర్జున విషాదయోగః

 ఓం నమో భగవతే వాసుదేవాయ 


ఓం శ్రీ గురుభ్యోనమః`

ప్రథమాధ్యాయము. 

అర్జున విషాదయోగః 

పశ్యైతాం పాణ్డుపుత్రాణాం ఆచార్యమహతీమ్ చమూమ్ | 

వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవశిష్యేణ ధీమతా || 

పశ్య - చూడండి; ఏతాం - ఈ ; పాణ్డుపుత్రాణాం -పాండుపుత్రుల యొక్క ; ఆచార్య-ఓ గురువర్యా ; మహతీమ్ -గొప్పదైన ; చమూమ్ - సైన్యమును; వ్యూఢాం -వ్యూహముగా ఏర్పాటు చేయబడిన ; ద్రుపదపుత్రేణ - ద్రుపదపుత్రునిచే; తవ - మీ యొక్క ; శిష్యేణ - శిష్యుడు; ధీమతా - గొప్ప బుద్ధిమంతుడైన. 


భావం: ఓ గురువర్యా, మీ బుద్ధికుశలుడైన శిష్యుడైన ద్రుపద పుత్రునితో వ్యూహముగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి. 


భాష్యం: బ్రాహ్మణుడు, గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుల లోపాన్ని రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తిచూపే ప్రయత్నం చేసాడు. ద్రౌపది తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యులవారికి గతంలో రాజకీయ వైరం ఉంది. ఈ వైరం కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞం చేసి, ద్రోణాచార్యుని వధించగలిగే పుత్రుడిని వరంగా పొంది ఉన్నాడు. ద్రోణాచార్యులవారు ఈ విషయం తెలిసి కూడా ద్రుపద పుత్రుడైన ద్రుష్టద్యుమ్నునికి విశాల హృదయం కలిగిన బ్రాహ్మణుడిగా వ్యవహరించి అతనికి యుద్ధ రహస్యాలను బోధించారు. ఇప్పుడు యుద్ధరంగంలో ధృష్టద్యుమ్నుడు పాండవుల పక్షము లో ఉన్నాడు. ద్రోణాచార్యులవారి  నుండి  పొందిన విద్య తోనే అతను పాండవ సేనా వ్యూహాన్ని కూడా రచించాడు. ద్రోణాచార్యుల వారు సావధానులై రాజీ పడకుండా యుద్ధం చేయాలనే ఉద్దేశ్యంతో అతని ఈ తప్పుని దుర్యోధనుడు ఎత్తిచూపాడు . అదేవిధంగా తన ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధరంగంలో అతను  మృదుస్వభావంతో ప్రవర్తించకూడదని తెలియచేయడం దుర్యోధనుని ఉద్దేశ్యం. ముఖ్యంగా అర్జునుడు ద్రోణాచార్యులవారికి ప్రియమైన   మరియు తెలివిగల శిష్యుడు. యుద్ధరంగంలో అలాంటి కరుణా భావం తమ  ఓటమికి దారితీసే అవకాశం ఉందని దుర్యోధనుడు హెచ్చరించాడు.  

Day 3: Radheshyam Prabhu Bhagavadgita

 Summary

Introduction PART III

Process of Understanding Gita and Going Back to Godhead


* We have four defects: inabilities, errors, cheating, subjected to illusion

* Inabilities of senses to see, hear.

* Pratyaksha, anumana methods are not possible due to these limitations.

* Vedas are beyond these four defects directly emitted from the lord and come via parampara.

* Hearing is better than seeing to perceive truth.

* Vedas stand the test of time. Plants have life, embryology, cow dung, cow urine, yoga, Vastu, Ayurveda, Viman shastra

* Predicted people in Vedas 

* Vedas offer knowledge about the source of everything.

* Mahabharata and Ramayana are history. They actually happened. 

* BG and Bhagavatam are the essence of Vedas.

* Knowledge comes from parampara : 

* Inductive vs deductive knowledge: Who is your father? To DNA test, will take 800+ years and still you will not be sure.

* Mantras are so powerful that earlier weapons were evoked by chanting mantras.

* Books: Veda, Teacher: guru, Bonafide institution:  sampradaya analogy

* How educated people got diverted from Vedas: Mecolay like people polluted. Misinterpreted the Vedas. Told that it is not worth spending time

* We are children playing at the seashore. Our palace may get smashed. Our relationship is not with the sandcastle but with our actual parents.

* There are four bonafide sampradayas

* Vedic knowledge is not a matter of research. It is a descending process. It is apaurusheya.

* Tukaram went back to godhead.

* In order to go back to godhead, do your duty but think of Krishna always.

Monday, 17 May 2021

Day-1: Radheshyam Prabhu Bhagavadgita

 Introduction to BG (Part I)


Who is Srila Prabhupada? More than 15 crore copies have been distributed till date.

Spirit in which Gita must be approached (B5)


Bhagavan 

* This word is used more than 27 times. Who is Bhagavan? Why not use Krishna?

* Markendeya rishi told the Pandavs. Do not take Krishna as an ordinary person. He narrates his own experience

* Similarly, when Bhishma was lying on a bed of arrows. He says the same thing.

* Ishvara param Krishna …

* Krishna showed the complete universe to mother Yashoda, Vishwaroopa Darshana was shown to Arjuna. To Yashoda, he showed sweetness and to arjuna, he showed greatness.

* Parashar muni definition: God should have all the opulence. He is Lakshmipati.

* All acharyas accepted Krishna as Supreme. Ete cham Kala pumsam. Arjuna also confirms this in BG itself. All acharyas worship the deity of Krishna.

* God is also personal (PM) and impersonal (His Government)


Bhakta Arjuna

* Arjuna is free from envy

* Arjuna is a friend and devotee that's why he was eligible to hear Gita

* There are many intelligent people like gyanis. Many gyanis become bhakta, Sukhdev Goswami.


Bhakti Yoga

* Bhaj dhatu means voluntary lovingly offering devotion to someone.

* Krishna washed the feet of Sudama.

* SB says that 12 Mahajanas have confirmed the authority of Krishna and his supremacy. They know the essence of shastras.

* We should follow the footsteps of these Mahajan.

* Deliver of his devotee: Gajendra


Bhagavad Gita 

* Great scientist, acharyas appreciated Gita

* More than 800 commentaries

* Even today it is very relevant, Used by management people

* Full stops for suffering

* Story of Brahman who was unable to read Gita: He appreciates how the supreme person has become master by * becoming a charioteer. The goal of reading Gita is to have such devotion. Mahaprabhu said.

* Envious people are like licking honey from outside of water.

* Gita as it is the most bonafide and widely read across the world.


Bhumi - Kurukshetra

* This was a holy war and Krishna is related to it that's why we worship.

* It is not symbolic. Kurukshetra is still there. Some people give allegorical meaning. They cook such speculated interpretation.

* Even Ramayan Maharabharata is proven by a scientific point of view.

* Don't miss the goal of Gita.


- Lecture summary compiled by: Jivnesh Sandham

Day -2 Radheshyam Prabhu Bhagavadgita

Lecture Summary

Introduction: Part II

Purpose and Subject of Gita


What is the purpose?

* We want to be free from suffering and want to know the goal of life. Animals suffer but they don't ask why they are suffering. In contrast to that, we can ask why we are suffering.

* Cause of suffering: we turned away from Gita

* To reduce suffering, we invent new things like AC.

* Everything in this life we do with a goal. Imagine football without a goal post. Therefore we must ask what is the goal of life.

* Animal vs Human: Four common activities. Then how humans are superior. Even animals do these four activities better than humans. Elephant, mosquito, bear, lion. We may do all these activities more sophisticatedly but the goal is the same.

* They don't have reasoning? Cats eat milk. Animals fight, we also fight.

* We communicate for these four activities only.

* Humans can ask who am I? What is the goal? Why am I suffering?

* We have to harmonize our life with nature and god to attain eternal happiness.

* Why am I suffering? What are the real problems? Birth, old age, disease, and death. These are common for everyone. Nobody wants to. Nobody can escape.

* Janma-mrityu-jara-vyadhi…(BG 13.8-12) Story of Buddha seeing these four stages.

* We all see all these four stages. We have to ask these questions? How to get rid of these sufferings.

Someone may say that I am already born, now young and death is very far. I am happy now. Apart from these, there are other problems: adi bhautik (other living beings), adhyatmik (minds), adhidaivika (natural calamity: Corona)

Scientists give temporary solutions.

* Where do we go after this body? Some say that after this body we finish. But Krishna says that you are soul and this body is like a vehicle and soul is sitting inside. Car may become invalid but the soul is eternal.

* These bodies are awarded based on karma. Whatever desire one has he will be awarded another body. As you sow that will reap. Those who violate four regs will suffer but those who follow four regs will be happy.

* ABCD formula:


Subjects of Gita: There are five subjects

* Ishvara :  Behind this body, atma is there. Behind nature, ishvara is there. We are tiny controllers. But the lord is the supreme controller. There is only one PM similarly Krishna is one. He is the creator of all wonderful things. Mayaadhakshena prakriti… 

* Prakriti :  There are two types. Para and apara. Material and spiritual world. This world is temporary. When clouds shower everything becomes so green. In summer all trees become shaven. At one time it is green and dry later. However, the spiritual world always remains green. 

* Jiva: We can make planes fly but lords can make float planets. We can wash away ants by water but demigods can wash away by Tsunami. Hitler tried to become a controller but got wiped away. 

* Kala : Time acts on everyone. Everything gets devoured

* Karma : For every action, there is a reaction. Who gives the reaction? For example, policemen punish you if you break a rule. Why are we living here?  At the time of death, everything is taken away. One must ask what is the purpose of life. We don’t do anything without purpose.

* Liberation is to leave this world and go back to godhead.

* We were in the custody of the lord and we want to be independent. That's why we came to this world. We need to recognize that we are servants of lord like Hanuman 


- Lecture summary compiled by: Jivnesh Sandham

1.2 ప్రథమాధ్యాయము; అర్జున విషాదయోగః

ఓం నమో భగవతే వాసుదేవాయ 


ఓం శ్రీ గురుభ్యోనమః`

ప్రథమాధ్యాయము. 

అర్జున విషాదయోగః 

సంజయ ఉవాచ 

2. దృష్ట్వాతు  పాణ్డవానీకం వ్యూఢమ్ దుర్యోధనస్తదా | 

ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ || 


సంజయ: ఉవాచ   - సంజయుడు పలికాడు; దృష్ట్వా -చూచిన తరువాత; తు - కానీ; పాండవానీకం - పాండవుల సేనను ; వ్యూఢమ్ -వ్యూహముగా ఏర్పడియున్న దానిని ; దుర్యోధనః- దుర్యోధనుడు;  తదా - అప్పుడు; ఆచార్యం - గురువును; ఉపసంగమ్య-సమీపించి; రాజా - ఓ రాజా ; వచనం - వచనములను; అబ్రవీత్ - పలికాడు. 

భావం: సంజయుడు చెప్తున్నాడు: ఓ రాజా! పాండు పుత్రులచే వ్యూహంగా ఏర్పాటు చేయబడిన సైన్యమును చూసి, దుర్యోధనుడు తన గురువు వద్దకు వచ్చి ఈ విధంగా పలుకుతున్నాడు. 

భాష్యం: దృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధర్మ విషయంలో తన పుత్రులు తనతో సమానంగా అంధులని అతనికి తెలుసు. పుట్టుకనుండీ ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందానికి రాలేరని అతనికి ఖచ్చితంగా తెలుసు. అయినా తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావం గురించి అతను సందేహితుడై ఉన్నాడు. యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ప్రశ్నించడంతో అతని అంతరార్ధాన్ని సంజయుడు అర్ధం చేసుకున్నాడు. అందుకే సంజయుడు నిరాశలో ఉన్న తన రాజును ఉత్సాహపరచడానికి పవిత్రస్తలం చేత ప్రభావితులై అతని పుత్రులు రాజీకి పడబోరని తెలియజేయసాడు. పాండవ సేనా బలాన్ని చూసిన తరువాత దుర్యోధనుడు పరిస్థితిని తెలియజేయడానికి వెంటనే సేనాధిపతియైన ద్రోణాచార్యుల వద్దకు వెళ్లాడని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు. దుర్యోధనుడు రాజుగా చెప్పబడినా, పరిస్థితి తీవ్రతని అనుసరించి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవలసివచ్చింది. అందుకే, రాజకీయవేత్త అనడానికి అతను తగినవాడు. కానీ పాండవ సేనా వ్యూహాన్ని చుసిన తరువాత అతను పొందిన భయాన్ని ఆ రాజనీతి నిపుణత తగ్గించలేకపోయింది. 




Sunday, 16 May 2021

1. 1 ప్రథమాధ్యాయము. అర్జున విషాదయోగః

ఓం నమో భగవతే వాసుదేవాయ 


ఓం శ్రీ గురుభ్యోనమః`

ఓం నమో భగవతే వాసుదేవాయ 

ఓం శ్రీ గురుభ్యోనమః`

ప్రథమాధ్యాయము. 

అర్జున విషాదయోగః 


ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేతా యుయుత్సవః | 

మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ|| 


దృతరాష్ట్ర ఉవాచ - దృతరాష్టుడు పలికాడు; ధర్మక్షేత్రే - ధర్మక్షేత్రమైన ; కురుక్షేత్రే - కురుక్షేత్రం అనే ప్రదేశం లో; సమవేతా -సమకూడి ఉన్న; యుయుత్సవ - యుద్ధోత్సాహం కలవారై; మామకా - నా పుత్రులు (పక్షం వారు); పాండవా - పాండురాజు పుత్రులు; చ - మరియు ; ఏవ- నిశ్చయంగా ; కిమ్ - ఏమి ; అకుర్వత -చేశారు; సంజయ-ఓ సంజయా 

భావం: దృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు. ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము నందు నా పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధం చేయడానికి సిద్ధమై సమకూడిన తర్వాత ఏమి చేశారు?

భాష్యం: శ్రీమద్భగవద్గీత గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం. ఇది గీతామహాత్మ్యం నుంచి తీసుకోబడింది. భగవద్గీతను కృష్ణుని భక్తుల సహకారంతో పరిశీలనాత్మకంగా చదివి ఎలాంటి సొంత అభిప్రాయాలు లేకుండా అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించాలని దానియందు చెప్పబడింది.  గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి నుంచి ప్రత్యక్షంగా విని అవగాహన చేసుకున్నాడు. ఈ విధంగా స్పష్టమైన అవగాహన కలుగుతుంది అని చెప్పడానికి భగవద్గీతలోనే నిదర్శనం ఉంది. మనిషి గురుశిష్య పరంపరలో సొంత అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు లేకుండా భగవద్గీతను అవగాహన చేసుకోగల భాగ్యవంతుడైతే సమస్త వేద జ్ఞానాన్ని, ప్రపంచంలోని ఇతర శాస్త్రాలని అవగతం చేసుకోగలడు. ఇతర శాస్త్రాలలో విషయాలనే కాకుండా  ఇతర క్లిష్టమైన విషయాలని సైతం పాఠకుడు ఈ భగవద్గీత యందు చూడగలడు. అదే గీత యొక్క విశిష్టమైన ప్రాముఖ్యత.  పూర్ణ పురుషోత్తముడైన శ్రీ కృష్ణ భగవానుడి ద్వారా ప్రత్యక్షంగా చెప్పబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుతోంది. 

మహాభారతంలో వర్ణించబడిన దృతరాష్ట్ర, సంజయుల సంభాషణలు  ఈ గొప్ప తత్వ శాస్త్రానికి మూల సిద్ధాంతాలై ఉన్నాయి. అనాదియైన వేదకాలం నుండి తీర్థస్థలంగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రం ఉద్భవించినట్లుగా తెలుస్తోంది. ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు అర్జుని పక్షంలో నిలిచి ఉండడం వల్ల  ధర్మక్షేత్రం అనే పదం ప్రాధాన్యతని సంతరించుకుంది. కౌరవుల తండ్రియైన దృతరాష్ట్రుడు తన పుత్రుల విజయ అవకాశం గురించి సందేహితుడై ఉన్నాడు. అందువల్ల అతను "వారు ఏమి చేసారు" అని తన కార్యదర్శి అయినా సంజయుడిని ప్రశ్నించాడు. తన పుత్రులు, పాండురాజు పుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్రం లో సమకూడారని అతనికి తెలిసి ఆవిధంగా  అడగడంలో ఒక ప్రాముఖ్యత ఉంది. జ్ఞాతులైన సోదరుల మధ్య అతను రాజీని కోరుకోలేదు. అంతే కాకుండా యుద్ధభూమిలో తన పుత్రుల విధి ఏ విధంగా ఉందొ అతను తెలుసుకోవాలనుకున్నాడు. కానీ దేవతలకు సైతం పూజనీయ స్థానంగా చెప్పబడిన కురుక్షేత్రంలో యుద్ధం ఏర్పాటు చేయబడటం వల్ల యుద్ధ పరిణామం పై స్థల ప్రభావాన్ని గురించి ఎక్కువగా భయపడ్డాడు. స్వభావరీత్యా ధర్మాత్ములైనందువల్ల అర్జునుడు మరియు ఇతర పాండు పుత్రులకు అది అనుకూల ప్రభావం చెపుతుందని అతను భావిస్తున్నాడు. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. దృతరాష్ట్రుని మందిరంలో ఉన్నప్పటికీ అతను వ్యాసుని కరుణ వల్ల కురుక్షేత్ర రంగాన్ని చూడగలిగారు. అందువల్లనే పరిస్థితిని గురించి దృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. 

పాండవులు మరియు దృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందిన వారు. కానీ కేవలం తన పుత్రులని మాత్రమే కురుసంతానంగా చెప్పి పాండు సంతానాన్ని వంశం నుంచి వేరుపరచడం ద్వారా దృతరాష్టుడూ తన మనస్సుని వ్యక్తపరుస్తున్నారు. సోదరుని పుత్రులైన పాండవుల పట్ల దృతరాష్టునికి గల సంబంధం దీనిద్వారా ఎవరైనా అర్ధం చేసుకోవచ్చు. పంటపొలం నుంచి కలుపుమొక్కలు తీసివేయబడునట్లుగా ధర్మ పిత అయినా శ్రీకృష్ణ భగవానుడు నిలిచి ఉన్న ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నుంచి కలుపుమొక్కలు లాంటి దుర్యోధనుడు, ఇతర దృతరాష్ట్ర తనయులు తీసివేయబడతారని, యుధిష్ఠిరుని అధ్యక్షతన ఉన్న ధర్మబద్ధులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్టులు కాగలరని మొదటినుండి ఊహించబడింది. చారిత్రిక మరియు వైదిక ప్రాముఖతయే కాక 'ధర్మక్షేత్రం ' మరియు 'కురుక్షేత్రం' అనే పదాలకు  విశిష్ట అర్ధం ఇదే. 

శ్రీ కృష్ణ సందేశం 19. 1 మహాభారతం

జీవితంలోని సంఘర్షణలను ఎదుర్కొనే శక్తి తమ మనసుకు లేదని తలచే వారికి తమ ఆత్మబలం మీద విశ్వాసం ఉండదు. అప్పుడు వారు సద్గుణాలను త్యజించి దుర్గుణాలను అలవరచుకుంటారు. 

యదార్థానికి మనిషి మనస్సులో ఆత్మవిశ్వాసం లోపించినప్పుడే వాని మనస్సులో దుర్మార్గం జనిస్తుందని  గుర్తించాలి. ఆత్మవిశ్వాసమే సచ్చీలతను ధారణ చేస్తుంది. 

ఈ ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి?. జీవితంలోని సంఘర్షణలు తమను నిర్వీర్యం చేస్తాయని నమ్మేవారు తమ ఆత్మవిశ్వాసాలన్నీ కోల్పోతారు. వారు సంఘర్షణలను అధిగమించడానికి మారుగా వాటిని వదిలించుకోవచాలనే ప్రయత్నం చేస్తుంటారు. అలా కాక సంఘర్షణలు తమని అధిక శక్తివంతం చేస్తాయని విశ్వసిస్తే, సరిగ్గా వ్యాయామం వాళ్ళ దేహ శక్తి పెరిగినట్లు ప్రతి ఒక్క సంఘర్షణతో పాటు వారిలో ఉత్తేజం పెరుగుతుంది. 

అనగా ఆత్మవిశ్వాసం అంటే ఏదో కాదు. అది ఒక మానసిక స్థితి. జీవితాన్ని దర్శించే ఒక అద్భుత దర్పణం అది. అయినా జీవితాన్ని దర్శించగలిగే సామర్ధ్యం మనిషి వశం లో నే ఉంటుంది కదా. 


శ్రీ కృష్ణ సందేశం 18. 2 మహాభారతం


మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి సదా భయానికి కారణాన్ని అన్వేషిస్తాడు. జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలని కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాం. 

అయితే ఈ భయం వాస్తవికమేనంటారా? ఆలోచించండి. 

భవిష్యత్తులో తనకు ఏదైనా ఆపద వస్తుందేమోనన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తుని నిర్దేశించేదెవరు? అది మన చేతుల్లోనే లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనే ఉండదు. భవిష్యత్తు ఈశ్వరాధీనంలోనే ఉంటుంది. 

అయితే ఎవరైనా మీకు హాని తలపెట్టాలని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వారివల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా? లేదు.. కానీ భయంతో నిండియున్న మనస్సు మనకు ఎక్కువ హానికరం అవుతుంది. ఇది సత్యం కాదంటారా?

విపత్కర పరిస్థితిలో భయావహః హృదయం అనుచిత నిర్ణయాలు తీసుకుంటుంది. అది విపత్తుని అధిక బాధాకరం చేస్తుంది. కానీ విశ్వాసంతో నిండిన హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా అధిగమించగలదు . అనగా ఏ కారణం వాళ్ళ మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో, భయం సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్నిస్తుంది. 

శ్రీ కృష్ణ సందేశం 18. 1 మహాభారతం

ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించి ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనసుకు తప్పకుండా అనిపించవచ్చు. అలా సత్కార్యాలే  చేయడం వల్ల , ధర్మాన్ని అనుసరించడం వాళ్ళ కలిగే ప్రయోజనమేమిటీ అని. 

కానీ దుష్టాత్ములకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా? దుష్ట కార్యాలు తలపెట్టేవారి హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా, ఎంతో చిరాకుగా ఉంటుంది. ఆ మనస్సులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తూ ఉంటాయి. అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. ఇదేనా సుఖం అంటే? 

అయితే ధర్మ మార్గాన నడిచేవారు సత్కార్యాలు చేసేవారు, సచ్చీలురైన వ్యక్తుల మనస్సులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి. పరిస్థితులేవీ వారి జీవన గమనంలో బాధింపులుగా ఉండవు. సమాజంలో గౌరవమర్యాదలు, మనసుకి సంతోషం లభిస్తాయి వారికి. 

అనగా, సత్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో లభించే సుఖాలకి మార్గం కాదు. సుఖానికి నిర్వచనే సత్ప్రవర్తన. 

అదేవిధంగా దుష్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖాలకి మార్గం కాదు. అధర్మం చేసిన మరుక్షణమే అది దుఃఖాలను ఉత్పన్నం చేస్తుంది. ధర్మం ఆచరిస్తే సుఖం రాదు. ధర్మానికి మరో పేరే సుఖం. 


శ్రీ కృష్ణ సందేశం 16. 1 మహాభారతం

ఎవరికైనా అపరాధానికి దండన లభిస్తే అటువంటప్పుడు అది అన్యాయమని ఆ వ్యక్తి మనస్సు రోదిస్తుంది. తాను ఆ అపరాధం చేసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని ఆ మనస్సుకు అనిపించవచ్చు. అపరాధం జరిగాక ఆ వ్యక్తి దానికి పశ్చాత్త్తాపం చెందాడు. తన ఆలోచనలలో పరివర్తన వచ్చింది. మరి ఆ వ్యక్తికీ దండన ఎందుకు లభించింది? 

నిజానికి ఒక చర్య జరిగిందంటే దానికి ప్రతిచర్య కూడా అనివార్యం. కర్మానుసారమే ఫలితం ఉంటుంది. 

ఇంకొకరికి ప్రేమ పంచితే సుఖం ప్రాప్తిస్తుంది. ఇంకొకరిని హత్య చేస్తే మృత్యుదండన లభిస్తుంది. చేసిన కార్యాన్ని బట్టే న్యాయం కూడా. 

అయితే పశ్చాత్త్తాపానికి మరి ఏ విలువా లేదా? ఉంది. అవశ్యం ఉంది. పశ్చాత్త్తాపం  మరియు ప్రాయశ్చిత్తం వల్ల మనిషికి ఆత్మా బలం పెరుగుతుంది. రానున్న దండనను స్వీకరించడానికి మనిషిని ఆయత్తం చేస్తుంది. అయితే ప్రాయశ్చిత్తం లేకుండా దండనను స్వీకరించడంలో ఫలితం ఉంటుందా? ఆలోచించండి. 


శ్రీ కృష్ణ సందేశం 15. 1 మహాభారతం

భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అందరూ నేడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. భవిష్యత్తులో సుఖపడాలి. భవిష్యత్తు సురక్షితం కావాలి అనుకోని వాటికి నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. 

మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీరు తీసుకున్న నిర్ణయాల్లో చాలావరకు భవిష్యత్ గురించి తీసుకున్నవి కావా? ఎందుకు తీసుకోకూడదు? మీ జీవితాన్ని సరళంగా సంతోషమయంగా చేసే అధికారం మీ అందరికీ ఉంది. 

కానీ భవిష్యత్తు ఎవరికీ తెలియనిది. కేవలం మీరు ఊహించుకోవచ్చు అంతే. అంటే జీవితంలోని అన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకొక మార్గం ఏదైనా లేదంటారా? ఆలోచించండి. 

సకల సుఖాలకు ఆధారం ధర్మమే. ఆ ధర్మం మనిషి హృదయంలో వశిస్తుంది . అందుకే ప్రతి నిర్ణయానికి ముందు మీరు మీ మనస్సులో అవశ్యం ఈ ప్రశ్న వేసుకోండి. "ఈ నిర్ణయం స్వార్థం నుంచి పుట్టినదా లేక ధర్మం నుండి పుట్టినదా అని. 

భవిష్యత్తు గురించి మారుగా ధర్మం గురించి ఆలోచించడం వల్ల భవిష్యత్తు అధిక సుఖమయం కాదంటారా? 

శ్రీ కృష్ణ సందేశం 14. 2 మహాభారతం

సంప్రదాయం లో ధర్మం నివసిస్తుంది. అలాగే సంప్రదాయాలే  ధర్మాన్ని పరిరక్షిస్తుంటాయన్నదీ సత్యమే. మరైతే కేవలం సంప్రదాయాలే  ధర్మమా? ఆలోచించండి. 

వాస్తవానికి పాషాణంలో శిల్పం దాగి ఉంటుంది. అదే విధంగా సంప్రదాయంలో ధర్మం దాగి ఉంటుంది. కానీ పాషాణమే శిల్పం కాదు. శిల్పానికి ఆకృతినివ్వడానికి దాన్ని చెక్కవలసి ఉంటుంది. అనవసరమైన భాగాల్ని దూరం చేయక తప్పదు. 

సరిగ్గా అదే విధంగా సంప్రదాయంలో ధర్మాన్ని వెతికిపట్టుకోవాలి. అది ఎలా అంటే ఇంద్రపూజ అనే సంప్రదాయానికి దూరమై, గోవర్ధనగిరి పూజ అనే ధర్మాన్ని అనుసరించకపోతే యాదవులకు తమ ముక్తి మార్గం లభించివుండేది కాదు. 

అంటే సంప్రదాయాన్ని పూర్తిగా విడనాడేవారు ధర్మానికి దూరమవుతుంటారు. అలాగే సంప్రదాయాన్ని గుడ్డిగా అనుసరించేవారికి కూడా ధర్మ మార్గం ప్రాప్తించడం దుర్లభం. 

హంసకు నీరు-క్షీర న్యాయం తెలుసు అంటారు. పాలలో కలిసిన నీటిని వేరు చేసి కేవలం పాలనే గ్రహిస్తుంది హంస. అయితే సరైన ధర్మాన్ని తెలుసుకోవాలంటే హృదయంలో జ్ఞానం వాళ్ళ ప్రాప్తించిన వివేకం అవసరం కాదంటారా? ఇక అటువంటి వివేకం లేనప్పుడు దేనినైతే ధర్మం అని నమ్ముతారో అది వాస్తవంగా ధర్మం కాకపోవచ్చు. ఇది కూడా సంభవమేగా? మీరే ఆలోచించండి. 

శ్రీ కృష్ణ సందేశం 14. 1 మహాభారతం

శకునాలు, పూర్వక అనుభవాల మీద ఆధారపడి మనం భవిష్యత్తులో సుఖ దుఃఖాల గురించి ఆలోచిస్తాం. భవిష్యత్తులో దుఃఖ కారణాన్ని నివారించడానికి మనం ఈరోజు ప్రణాళికలు వేసుకుంటాం. 

అయితే రానున్న కష్టాలను ఈరోజు నిర్మూలించడం ద్వారా మనం పొందేది లాభమా, నష్టమా? 

మనలో ఎప్పుడూ ఈ ప్రశ్న ఉదయించదు . యదార్థం చెప్పాలంటే సమస్యలు, వాటి పరిష్కారం ఏకకాలంలో ఉద్భవిస్తాయి. వ్యక్తికైనా సరే అలాగే ఈ సృష్టికైనా సరే.. కాదా?

మీరు మీ గత జీవితాన్ని గుర్తుచేసుకోండి. చరిత్రనే చుడండి. సమస్య ఉత్పన్నమయ్యే ప్రతి సందర్భం లో నూ ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఉత్పన్నమవుతుంది తెలుస్తుంది. ఈ షాకైతే సృష్టిని నడిపిస్తుంది. 

యదార్థానికి సమస్యలే శక్తి ఉద్భవించడానికి కారణం అవుతాయి. సమస్యను ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి దాన్ని అధిగమించిన తరువాత పరిణామ క్రమంలో ముందడుగు వేస్తాడు. అతని బుద్ధి వికసిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణుడయ్యెది కేవలం అతను మాత్రమే కాదు. అతనితో పాటు సమస్త విశ్వమూ వికసిస్తుంది. 

వాస్తవానికి సమస్య ఉద్భవిస్తే ఒక అవకాశం ఉద్భావిస్తుంది. మనలో మార్పు తెచ్చుకొనే అవకాశం, మన ఆలోచనలలో పరిణతి తెచ్చుకొనే అవకాశం, మన ఆత్మను శక్తివంతంగానూ, జ్ఞాని బాండం గానూ మార్చుకోవడానికి దీన్ని ఉపయోగించుకున్న వారికి ఎటుంవంటి సమస్యలూ ఉండవు.  ఉపయోగించుకొని వారికి? వారు సమస్త విశ్వానికి ఒక సమస్య అవుతారు. మీరే ఆలోచించండి.  


శ్రీ కృష్ణ సందేశం 13. 1 మహాభారతం

ఎప్పుడైనా ఒకరి కోరికకు, ఆశకు భంగం కలిగితే అప్పుడు విచారి హృదయం కృథంతో నిండిపోతుంది. తమ నిరాశకు, క్రిడానికి కారణమైన వ్యక్తిని తానూ దండించే ప్రయత్నం చేస్తాడు. 

మరైతే ఇలా మన కోరికకు, ఆశకు భంగం కలగడం అన్నది సదా ఇంకొకరి అపరాధము అవుతుందా? కోరికలు సఫలం కాకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. కొన్ని కోరికలు అనుకోని విధంగా సఫలం కాకుంటే మరికొన్నింటికి విధి కారణం కావచ్చు. 

అయినా అప్పుడప్పుడు కోరికల స్వభావమే ఎలా ఉంటుందంటే అవి సఫలం కాలేనివి అయి ఉంటాయి. మరి పరిస్థితుల్ని విచారించకుండా ఇంకొకరిని అపరాధి అని తప్పు పట్టడం న్యాయం కాదు. ప్రతీకారమవుతుంది. 

న్యాయానికి ఆధారమైనది దయ, అరుణ, అలాగే ప్రతీకారానికి కారణం కృథం, అహంకారం ఆంటీ హృదయంలో కరుణాని ధారణా చేయకుండా ఇంకొకరి అపరాధం గురించి న్యాయ విచారణ చేయడం, దానికి వారిని దండించడం పూర్తిగా ధర్మ విరుద్ధం కాదా? ఆలోచించండి. 


శ్రీ కృష్ణ సందేశం 11. 1 మహాభారతం

సత్యమే పలకాలని నిశ్చయించుకొనే  తరుణం అందరి జీవితాల్లోనూ తరచూ వస్తూ ఉంటుంది. అయితే సత్యం మాత్రం నోటినుంచి బహిర్గతం కాదు. ఏదో భయం మనిషిని ఆవహిస్తుంది. 

ఏదైనా సంఘటన లేక అనుభవం గురించి మాట్లాడడం లేదా మరి స్వయంగా చేసిన తప్పిదాన్ని గురించి ఇతరులకు చెప్పుకోవడం... అయితే సత్యమంటే ఇదేనా? కాదు. ఇదంతా కేవలం తథ్యం. అంటే కేవలం జరిగిందంతా జరిగినట్లు చెప్పేయడం సామాన్యమైన విషయమే. 

కానీ అప్పుడప్పుడు ఆ సత్యాన్ని చెబుతున్నప్పుడు కూడా భయం వేస్తుంటుంది. సాధారణంగా ఎదుటివారి భావాల గురించి ఆలోచిస్తుంటుంది మన మనస్సు. ఇతరులకు దుఃఖం కలుగుతుందని భయం కూడా అడ్డు తగులుతుంటుంది. 

అయితే ఈ సత్యమనేది ఏంటి? ఎప్పుడైనా దీనిగురించి ఆలోచించారా? మనస్సులో భయం నిండినప్పటికీ ఎవరైనా తథ్యంగా మాట్లాడితే అదే నిజంగా సత్యమవుతుంది. 

వాస్తవానికి సత్యమంటే ఏమిటంటే భయరాహిత్యానికి ఇంకో పేరు. ఇక భయాన్ని త్యజించేందుకు సమయం అడ్డురాదు. ఎందుకంటే భయ రాహిత్యం ఆత్మకు స్వతః సిద్ధ స్వభావం అంటే జీవితంలోని ప్రతి క్షణమూ సత్యం పలికే క్షణం కాదంటారా? 


శ్రీ కృష్ణ సందేశం 10.2 మహాభారతం

ఎప్పుడూ తండ్రి తన పుత్రుడు సుఖపడాలనే కోరుకుంటాడు. వాని భవిష్యత్తు గురించే నిత్యం చింతిస్తూ ఉంటాడు. ఈ కారణం వల్లనే బహుశా తన సంతానం యొక్క భవిష్యత్తుకు మార్గాన్ని స్వయంగా తానే నిశ్చయించే ప్రయత్నాన్ని చేస్తుంటాడు. 

తండ్రి తానూ ఏ మార్గాన నడిచాడో, ఏ మార్గంలోని సంకట పరిస్థితులను స్వయంగా చూశాడో, ఏ మార్గంలోని వెలుగు నీడలేని స్వయంగా చూశాడో, తెసులుసుకున్నాడో, అదే మార్గంలో పుత్రుని కూడా నడవమంటాడు. ఈ కొరికే ఉంటుంది ప్రతి తండ్రికీ. నిస్సందేహంగా ఉత్తమ భావనే ఇది. 

అయితే ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మనం మర్చిపోతుంటాం. 

మొదటిప్రశ్న:  కాలంతో పాటుగా ప్రతి మార్గంలోనూ మార్పులు రావంటారా? కాలంతో పాటు కొత్త పరిస్థితులు ఎదుర్కొరంటారా? మరి గతించిన కాలం నాటి అనుభవాలు కొత్త తరానికి ఎలా ఉపయోగపడతాయి?

రెండవ ప్రశ్న: పిల్లలకు తమ తల్లిదండ్రుల దగ్గరినుంచి అన్నీ లభిస్తాయా? 

హా. పిల్లలకు సంస్కారం నేర్పేది వారి తల్లిదండ్రులే. కానీ మనసులోని సమతుల్యం? 

మనసులోని సమతుల్యం ఈశ్వరుడు ఇస్తాడు. ఏ మార్గాల్లో అయితే తండ్రికి సాఫల్యం లభించిందో అదే మార్గం.ఓ నడిచే వారి సంతానానికి సుఖము, సాఫల్యం లభిస్తాయని విశ్వసించగలరా? 

చివరిప్రశ్న: జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు, సవాళ్ల వాళ్ళ ప్రయోజనం లేదంటారా? 

ప్రతి ఒక్క కొత్త ప్రశ్న, సరికొత్త సమాధానానికి తెరతీయదంటారా? అయితే మరి సంతానాన్ని కొత్త కొత్త ప్రశ్నలు, సంఘర్షణలు, సవాళ్లకు దూరంగా ఉంచడం... దీనిని వాళ్లకి మంచి చేయడం అంటారా లేక హాని చేయడం అంటారా..? 

అంటే ఏ ప్రకారంగా సంతానం యొక్క భవిష్యత్తును నిర్మించడానికి మారుగా వారి వ్యక్తిత్వానికి రూపుదిద్దడం శ్రేష్టమో అదే విధంగా వారి జీవిత మార్గాన్ని నిశ్చయించడానికి మారుగా వారికి కొత్త కొత్త సంఘర్షణలు ఎదుర్కోవడానికి మనోబలం, విజ్ఞత అందించడం ఎక్కువ ప్రయోజనకరం కాదంటారా? ఆలోచించండి.  

శ్రీ కృష్ణ సందేశం 10.1 మహాభారతం

 

నిర్ణయాలు తీసుకునే క్షణాన సాధారణంగా ఇంకొకరి సలహా సూచన, బుద్ధి, లేదా సానుభూతి మీద ఆధారపడుతూ ఉంటాం. అలాగే మన భవిష్యత్ జీవితం మనం ఈరోజు తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. 

అయితే మన భవిష్యత్తు ఎవరో అన్యుల సానుభూతి, సలహాల పర్యవసానమేనా? అలాగే మానవ జీవితం ఎవరో అన్యుల బుద్ధి యొక్క పరిణామమేనా? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా?

ఇది మనందరికీ తెలిసినదే కదా. ఒకే పరిస్థితిలో వేరు వేరు వ్యక్తులు వేరువేరుగా ఆలోచిస్తుంటారు. 

దేవాలయంలో నిలబడ్డ భక్తుడు దానం చేయాలనుకుంటాడు. కానీ ఒక దొంగ అవకాశం దొరికితే దేవుడి నగలు దొంగిలించాలనుకుంటాడు. 

మనస్సులో ధర్మం ఉన్నవారు ధర్మబద్ధమైన సలహా ఇస్తారు. ఇక మనస్సులో అధర్మం ఉన్నవారు అధర్మ మార్గాన్ని సూచిస్తారు. 

ధర్మబద్ధమైన సలహా స్వీకరించినపుడు మాత్రమే మనిషికి సుఖ సంతోషాలు లభిస్తాయి. కానీ ధర్మబద్ధమైన సలహాను స్వీకరించి ఆచరించడానికి ఏ మనిషికైనా మనస్సులో ధర్మముండాలి. అంటే ఇతరుల సలహాలను కానీ, సూచనలు కానీ స్వీకరించేముందు మీ హృదయం లో ధర్మాన్ని ప్రతిష్టించుకోవాలి. ఇది యదార్ధం కదా.  

శ్రీ కృష్ణ సందేశం 9.1 మహాభారతం


ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండవలసి వచ్చినప్పుడు ఒకరిపట్ల ఒకరు కొన్ని అవధులు, నియమాలు నిర్మించుకొనే ప్రయత్నం చేయడం సహజమే కదా. 

మనం ఈ మానవ సంబంధాల గురించి ఆలోచించి చూస్తే ఈ సంబంధాలన్నింటికీ ఆధారం ఇలా ఇతరులకు మనం నిర్ణయించే అవధులే అని గుర్తిస్తాం. అయితే ఈ అవధులను ఎవరైనా అనుకోకుండా అతిక్రమిస్తే  ఇక ఆ క్షణాన మన మనసంతా కోపంతో నిండిపోతుంది. ఈ అవధులు వాతావ రూపమేమిటన్నది ఎప్పుడైనా ఆలోచించారా? 

అవధులు నిర్మించడం వాళ్ళ మనం ఎదుటివారికి నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వడంలేదు. మన నిర్ణయాలన్నీ ఇతరుల మీద మోపుతుంటాం. అంటే ఎదుటివారి స్వేచ్చని స్వీకరించలేకపోతున్నాం. 

ఎప్పుడైతే ఒకరి స్వేచ్చని హరిస్తున్నామో అప్పుడు వారి హృదయం దుఃఖభరితమవుతుంది. ఎప్పుడైతే వారు అవధులు ఉల్లంఘిస్తారో అప్పుడు మన హృదయం కోపంతో నిండిపోతుంది. 

అయితే ఒకరు ఇంకొకరి స్వేచ్చని ఎప్పుడైతే గౌరవిస్తారో ఇక వారికి ఏ అవధులు, నిబంధనల అవసరమే ఉండదు. 

అంటే మనస్ఫూర్తిగా స్వీకరించడం అనేది ఆ బంధానికి దేహమైతే అలాంటి బంధానికి స్వేచ్ఛ ఆత్మ అవుతుంది. 

శ్రీ కృష్ణ సందేశం 8. 1 మహాభారతం

 ఎప్పుడైనా ఒక వ్యక్తికీ ఏదైనా ఘటనలో అన్యాయం జరిగింది అనిపిస్తే ఆ ఘటన అతని అంతరంగాన్ని టీవీరంగా కుదిపేస్తుంది . సమస్త జగత్తు అతనికి శత్రువులాగే కనిపిస్తుంది. అన్యాయం అనిపించిన ఘటన ఎంత పెద్దదైతే మనుషుల హృదయం కూడా అంతే విరోధించసాగుతుంది. ఆ ఘటనకు బదులుగా వారు న్యాయమడుగుతారు. నిజానికి ఇది సరైనదే. 

వాస్తవానికి సమాజంలో ఏ విధమైన అన్యాయమైన వ్యక్తుల ఆసరాకు, నమ్మకానికి వినాశకరం. కానీ ఇంతకీ ఈ న్యాయం అంటే ఏమిటి? ఈ న్యాయానికి అర్థమేమిటి? 

అన్యాయం చేసినవారు నిజానికి తాము చేసినదానికి పశ్చాత్త్తాపం చెందాలి. అలాగే అన్యాయానికి గురైన వ్యక్తి మనస్సులో మరలా సమాజం పట్ల విశ్వాసం కలగాలి. న్యాయానికి అర్ధం ఇదేగా. 

కానీ ఎవరి హృదయాలందు ధర్మం ఉండదో వారు న్యాయాన్ని వదిలేసి వైరాన్ని, ప్రతీకారాన్ని ఆశ్రయిస్తారు. హింసకి బదులుగా ప్రతిహింస అనే భావనతో సాగుతారు. తాము అనుభవించిన బాధ కంటే ఎంతో అధిక బాధని కలిగించ ప్రయత్నిస్తారు. 

ఈ మార్గం లో నడుస్తూ అన్యాయానికి బలైన వారే స్వయం గా అన్యాయం చేస్తారు. దీంతో వారూ అపరాధులవుతారు. 

అంటే న్యాయానికి, ప్రతీకారాన్ని మధ్య చాలా తక్కువ అంతరమే  ఉంటుంది. అలాంటి అంతరం పేరే ధర్మం. 

Tuesday, 11 May 2021

శ్రీకృష్ణ సందేశం 7.1 మహా భారతం

ఈ సృష్టి ఆరంభం నుంచే మనుషులను ఒక ప్రశ్న కలవరపెడుతోంది. తమ అనుబంధాలనుంచి ఎక్కువపాళ్లు సుఖం, అతి తక్కువపాళ్లు దుఃఖం పొందడమెలాగా అని. 

ఈ లోకంలో ఉన్న మీ అనుబంధాలన్నీ మీకు సంపూర్ణ సంతోషాన్నిస్తున్నాయా..? ఆలోచించండి.. 

మనిషి జీవితం అనుబంధాలపై ఆధారపడుతుంది. వారి భద్రతాభావం కూడా అనుబంధాలపైనే ఆధారపడుతుంది. ఈ కారణం గానే మీ జీవితం లో సుఖసంతోషాలకు ఆధారం పూర్తిగా అనుబంధాలు. 

అయినప్పటికీ మీకు ఈ అనుబంధాల మూలంగా అత్యధికంగా దుఃఖమెందుకు ప్రాప్తిస్తుంది? 

సదా అలా సంఘర్షణలు సైతం అనుబంధాల మూలంగా ఎందుకు ఉత్పన్నమవుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా?

ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి ఆలోచనలు, లేదా అతని పనులు స్వీకరించలేనప్పుడు అతనిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే సంఘర్షణ మొదలవుతుంది. 

అనగా తిరస్కారం ఎంత ఎక్కువవుతుందో సంఘర్షణ అంత ఎక్కువవుతుంది. అలాగే ఆమోదం అధికమైతే, ఆనందం కూడా అధికమవుతుంది. ఇది వాస్తవం కాదంటారా? 

ఒక మనిషి స్వయంగా తన ఆపేక్షలపై అంకుశం పెట్టి తన అంతరంగాన్ని పరిశీలించి ఇంకెవరో వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మాని స్వయంగా తన ఎదలో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, అతనికి అనుబంధాల మూలంగా సంతోషం పొందడం అంత కఠినం కాదుగా.. 

అంటే ఆమోదమే మన అనుబంధాలకు నిర్వచనం కాదంటారా.. మీరే ఆలోచించండి. 

శ్రీ కృష్ణ సందేశం 6. 1 మహాభారతం

జీవితం లోని ప్రతిక్షణమూ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఇంక నిర్ణయం మాత్రం తన ప్రభావాన్ని వదిలే వెళ్తుంది. 

నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో, దుఖానికో కారణం అవుతుంది. కేవలం తనకే కాదు. తన కుటుంబానికి, ఇంకా రానున్న తరతరాలకు కూడా. 

ఏదైనా  సందిగ్ధత ఏర్పడితే అప్పుడు మనసు వ్యాకులమవుతుంది. అతలాకుతలమైపోతుంది. నిర్ణయించుకున్న ఆ క్షణం యుద్ధమే అవుతుంది. ఇంక ఆ మనస్సు రణభూమిగా మారిపోతుంది. 

సాధారణం గా మనం నిర్ణయాలు సందిగ్దతను నశింపచేయడానికి కాకుండాఆ కేవలం మనస్సుని శాంతిపచేయడానికే తీసుకుంటాం. అన్నట్టూ, ఎవరైనా పరిగెడుతూ భోజనం చేయగలరా..? లేదు.. అయితే యుద్ధానికై ఉర్రూతలూగే మనస్సు ఏదైనా సరైన నిర్ణయం తీసుకుంటుందా? 

వాస్తవానికి శాంత మనస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది తమకోసం సుఖమయంగా భవిష్యత్తుని నిర్మిస్తుంది. కానీ తమ మనస్సుని శాంతిపచేయడానికి ఏదో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి భవిష్యత్తులో తన కోసం కంఠకభరితమైన వృక్షాన్ని నాటినట్లే.. ఆలోచించండి.