మహా కోపిష్టి అయిన ఒక అతను ఉన్నాడు....
అతని పేరు పశుపతి నాయర్...
అతని వృత్తి దేవాలయ నిర్మాణం.....
ఒకసారి ఈ కోపాన్ని నేను నిరోధించ లేనా అని అడిగారు ఒక అతనిని.... తమిళనాడు లో ఒక శివాలయం ఉంది.. దాన్ని పునర్నిర్మాణం చేయండి అన్నారు...
సరే అని శివాలయం నిర్మాణం పూర్తి చేసి రథోత్సవం నిర్వహించారు.రథోత్సవం చేసేటప్పుడు రథం కొంత దూరం వెళ్లిన తరువాత కదలలేదు.... ఒక చోటికి వెళ్లిపోయాక ఆగిపోయింది..... అక్కడ ఉన్న వాళ్లు... రథోత్సవం జరిగే ముందు బలి ఇవ్వాలి... ఇవ్వలేదు కదా అందుకే ఇలా అయింది...అన్నారు.....
ఎవరిని బలి ఇవ్వాలి... అంతటా ఈశ్వరుడు ఉన్నాడు... ఈశ్వరుడు బలి ఎందుకు అడుగుతారు.... ఈ సారి అందరం ఈశ్వర నామం చెప్తూ దీన్ని లాగుదాం.... అప్పుడు ఇది కదులుతుంది. ఒకవేళ అప్పటికి కదలక పోతే నా తల తీసి రథం కింద పెడతాను అన్నారు పశుపతి గారు ....
రథం కదిలి గుడి చుట్టూ తిరిగి... ఈయన ఏ ఇంటిలో ఉండి గుడి పునర్నిర్మాణం చేశారో ఆ ఇంటి దగ్గర ఆగినపుడు హారతి ఇస్తున్నారు....
అప్పుడు అనిపించింది ఆయనకి... ఈశ్వర... ఒక్క నా మాట ఎంత మన్నించావు తండ్రి... ఎంత కోపిష్టి వాడిని.... ఇంత కోపిష్టి వాడివి... రథం కదలక పోతే తలే పెట్టేస్తా అంటున్నాడు.....నిజంగానే పెట్టేస్తాడు అని దబాలున రథం కదిపేసావా.... ఎంత కారుణ్యం అయ్యా నీకు నా మీద అనుకుంటూ.... శివుడి వంక చూస్తూ కన్నుల నీరు కారుస్తూ ఆయన వాత్సల్యం అనుభవిస్తూ ఉండగా జ్యోతి స్వామి లో కలిసిపోయింది...
No comments:
Post a Comment