ఉన్నత స్థానంలో నేనుండాలనే కోరిక కోరుకొవాలని నిన్నేతుక్కుంటూ వస్తే "స్మశానంలో కనపడ్డావ్"..నువ్వెంత ఉన్నత స్థానానికి వెళ్ళినా,రావాల్సిన స్థానం ఇదేనని కాటి కాపారితో చెప్పించావ్ ..ఇంకా నిన్నేం అడగాలిరా శివ...
వేల కోరికలు కోరుకొని గుడిబయటికొస్తుంటే ప్రసాదంగా "బూడిదిచ్చారు"..నేను నీకేమిచ్చిన,నువ్వు సొంతంగా ఏది పొందినా ..నా శరీరం మీద ఎప్పుడు ఉండేది,నీ శరీరం ఎప్పటికైనా పొందేది ఇదేనని పూజారితో చెప్పించావ్...ఇక నిన్నేం అడగమంటావురా శివ...
కోపాన్ని అధీనంలో ఉంచుకునే వారమడుగుదామని వస్తే ...పూల బాణం వేసినందుకు మన్మధుణ్ణి భస్మం చేసావని,తలుపుకి అడ్డుగా నిలబడ్డందుకే కొడుకు తల నరికేసవని చెప్పారు..అది విని వెనక్కి వెళ్లిపోవడం తప్ప ఎం చెయ్యగలనురా శివ...
ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు నీకు చెప్పుకుందామని వస్తే ..ఆయనే గొంతులో విషాన్ని పెట్టుకొని మింగలేక ,కక్కలేక కష్టపడుతున్నాడనే మాటలు విన్నాను...ఇక నేను చెప్పుకోవాలనుకోవడం మూర్కత్వమే కదారా శివ...
రాక్షసులు అంతమవ్వాలనే వరం ఇమ్మని అడగుదామని వస్తుంటే....నీ దర్శనం చేసుకొని ఆనందంతో తాండవం చేసుకుంటూ వస్తున్న రాక్షసులు నాకు ఎదురు పడ్డారు...నాకు నువ్వెంతో,వాళ్ళు అంతే అనుకొనే నిన్ను ఇంకేం అడుగుతామురా శివా.....
తృప్తి,ముక్తి పొందాలని నీ దెగ్గరికి వస్తే..ఆ రెండిటికోసం నువ్వే కల్లు తాగుతూ,గంజాయి పిలుస్తున్నావని తెలిసింది..ఇంకా నా నోటా,మాటెలా వస్తుందిరా శివా...
మనశ్శాంతిగా ఉండే జీవితం కోసం నీ దెగ్గరికి వస్తే ..నువ్వే దానికోసం ఎముకలు కొరికి చలున్న హిమాలయాల్లో,ఎవరు రాని ప్రదేశంలో ధ్యానం చేసుకుంటున్నావని చెప్పారు..అడగటానికి ఇంకేముంటుందిరా శివ...
హహ...కానీ,నువ్వంటే ఇష్టం ,నువ్వొక వ్యసనం కారణం...
"ఆడవాళ్ళని,మగవాళ్ళని వేరు చేసి చూసే మాకు గంగని తలపై పెట్టుకొని,పార్వతికి శరీరంలో సగ భాగం ఇచ్చి..ఆడవాళ్లంటే,మగవాళ్ళకి వ్యతిరేకం కాధు..మగవారిలాగే,ఆడవాళ్లు కూడా ఈసృష్టిలో ఒక భాగం అనే విషయం చెప్పావు చూడు అందుకే నువ్వంటే వ్యసనం"...
"మేడలో పాముని వేసుకొని,అది తినే ఎలుకని కొడుక్కి వాహనంగా ఇచ్చి,పాముని తినే నెమలిని ఇంకో బిడ్డకి వాహనంగా చేర్చి,నువ్వెక్కి తిరిగే నందిని తినే సింహాన్ని పార్వతికి ఆసనంగా మార్చి,అవన్నీ ఒకే దెగ్గర ఉండేలా చేసి ..ఇవే జాతి వైరం లేకుండా పక్క, పక్కన బ్రతుతున్నాయి,మరి జ్ఞానమున్న మనుషులు మీ పరిస్థితేంటి అని ప్రశ్నిస్తున్నావు కదా " అందుకే నువ్వంటే వ్యసనం..
"సాగర మధనంలో విషం వచ్చినప్పుడు అందరికంటే ముందుగా అక్కడికి చేరింది నువ్వే,అమృతం వచ్చినప్పుడు అక్కడికి రానిది కూడా నువ్వే...ఫలితం ఎవ్వరు సుఖంగా అనుభవించినా పర్లేదు,కానీ దాని తాలూకు కష్టం మొత్తం మనమే అనుభవించాలనుకునే నీ ఆలోచనకి నేను వ్యసనపరుడనే "...
"కోపం ప్రతి జీవి లక్షణం ,కానీ,అది అవలక్షణం అవ్వకూడదనే విషయాన్నీ మాకు తెలియడానికి నీ జీవితాన్నే చాలసార్లు ఉదాహరణగా చుపించావ్ కదా అందుకే నీకు వ్యసనపరుణ్ణి"...
" అర్హతలేని వాళ్లకి అవకాశమిస్తే ఏమవుతుందో "ఒక రాక్షసుడికి తల మీద చెయ్యి పెడితే భస్మమై పోవాలనే వరాన్ని ఇచ్చి,ఒక రాక్షసుడికి చావే లేకుండా వరాన్ని ఇచ్చి నువ్వు పడిన బాధనే మాకొ గుణపాఠంలా చెప్పావ్ కదా అందుకే నువ్వంటే వ్యసనం"...
"మనం చేసిన తప్పు ఎంత పెద్దదైనా సరిచేసుకొని అవకాశం ఉంటుందని,వస్తుందని "మాములు బాలుడి తల ఆవేశంతో నరికి, తర్వాత ఆలోచనతో ఏనుగు తల అతికించి... అందరూ ముందు పూజించాల్సినంత గొప్ప స్థాయికి ఆ బాలున్ని పంపి అందరికి నాయకుడిగా ఉండే వినాయకుణ్ణి చేసి చూయించావు కదా "అందుకే నువ్వొక వ్యసనం...
"కల్లు తాగినా ,గంజాయి పీల్చిన ఒక్కసారి కూడా తప్పుగా ప్రవర్తించిన సందర్భం లేకుండా,ఆ వెంటనే ధ్యానం చేసుకుంటూ.."మన జీవితపు శాశ్వత ఆనందాన్ని తాత్కాలికంగా మార్చేది వ్యసనం,తాత్కలిగంగా చేసిన శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చేది ధ్యానం" అని అలవాట్లు ఆ అనుభవించి మాలాంటి వాళ్ళకి అర్ధమయ్యేలా చేసావు కదా " అందుకే నువ్వొక వ్యసనం...
నీ గురించి ఎంత చెప్పిన తరిగేది కాదు...ఎందుకంటే నీ గురించి చెప్పడం కూడా నీ ఛెర్యే కదా...
"శివుడు అర్చర్యం కలిగించే శక్తులు ఉన్నవాడు కాదు,అర్ధం చేసుకుంటే అద్భుతం అనిపించే వ్యక్తిత్వం ఉన్నవాడు"..."శివుడికుండాల్సింది భక్తుడిగా కాదు,విద్యార్థిగా"...
"శివుడు పూజించాల్సిన దేవుడో లేక నమ్మాల్సిన దేవుడో కాదు..అర్ధం చేసుకోవాల్సిన దేవుడు...
ఓం నమశ్శివాయ!!
నాలోన శివుడు గలడు,నీలోన శివుడు గలడు....
No comments:
Post a Comment