మున్సిపాలిటీ లో వీధులు ఊడ్చేవాడికి వాడు రోజూ పని చేసి చేసి విసుగొచ్చింది...
దేవుడితో మొరపెట్టుకున్నాడు.🙏
స్వామి నువ్వు "రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు. నా బతుకు చూడు. ఎంత కష్టమో?.
ఒక్క రోజు... ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి.. నీ పనిని నేను చేస్తా..!"
అని సవాలు, ఛాలెంజ్ విసిరాడు...
దేవుడు వినీ అతడి ఛాలెంజ్ కు సరేనన్నాడు...
"అయితే ఒక్క షరతు...
నీ ముందుకొచ్చిన భక్తులు
ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు... నోరు మెదపకూడదు..." అన్నాడు దేవుడు...
"సరే" అన్నాడు మనోడు...
తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు...
కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు...
"దేవుడా... నేను నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను... ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు స్వామి"
అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు... ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది... అతను చూడకుండా వెళ్లిపోయాడు.
మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అని అందామనుకున్నాడు...
(కానీ దేవుడు చెప్పిన షరతు గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.)
ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు...
"దేవుడా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది స్వామి... అది కూడా నీకు సమర్పించు కుంటున్నాను... దయచూడు తండ్రీ"
అంటూ కళ్లు మూసుకుని మోకరిల్లాడు...
కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది...
"ఇలా దయ చూపించావా తండ్రీ" అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు...
"ఒరేయ్ దొంగా.... " అని అరుద్దామనుకున్నాడు మనోడు...
(కానీ దేవుడు చెప్పిన షరతు గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించుకున్నాడు.)
ఆ తరువాత ఒక నావికుడు(కెప్టెన్) వచ్చాడు...
"దేవుడా రేపు సముద్ర ప్రయాణం (డ్యూటీ) వెళుతున్నాను... నన్ను చల్లగా కాపాడు స్వామీ" అన్నాడు...
అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో సహ వచ్చాడు...
"నా తరువాత వచ్చింది ఇతడే. కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు. పట్టుకొండి" అన్నాడు..
పోలీసులు అతడిని అరెస్టు చేశారు...
ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఇక ఉండబట్టలేక పోయాడు... దేవుడి షరతును పక్కన పెట్టి..
"ఆగండ్రా... ఇతను నిర్దోషి... అసలు దొంగ (పేదోడు) ఇంకొకడు. వాడు పర్సును తీసుకెళ్లాడు." అని అరిచేశాడు...
సాక్షాత్ దేవుడే చెబుతుంటే .... ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి, పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు...
సాయంత్రానికి వీధులు ఉడ్చేవాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు..
దేవుడు వీధులు ఉడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు...
"దేవుడా...
ఇవాళా ఎంత మంచి పని చేశానో తెలుసా...?
నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను.
ఒక దోషిని అరెస్టు చేయించాను."
అన్నాడు మనోడు. పెద్ద తోపులా...
దేవుడు "ఎంతపని చేశావోయ్.
నిన్ను అసలు స్పందించొద్దన్నానా... ఎందుకలా చేశావు?." అన్నాడు నిష్ఠూరంగా..
"అదేమిటి?
నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను." అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా....
ధనవంతుడు మహాపాపాత్ముడు.
వాడు అందరినీ దోచుకుంటాడు...
వాడి డబ్బులో కొంత పేదోడికి అందితే వాడికి కొంచెమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను...
పేదోడికి కష్టాలు తీరేవి...
వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు...
ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు...
దారిలో పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు...
వీడు(నావికుడు) అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు...
కానీ ఇప్పుడు చూడు...
పేదోడు జైల్లో ఉన్నాడు..
ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు...
నావికుడు చావబోతున్నాడు...
ఎంత పని చేశావు నువ్వు...అన్నాడు దేవుడు...
దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు...హ
కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు..
తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పు అయి ఉండచ్చు..
ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం సామాన్యులం అయిన మనకేవరికి #సాధ్యం కాదు...
అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ ఆ భగవంతుడిని నిత్యం ధ్యానించాలి... ప్రార్థించాలి... నమ్మకం ఉంచాలి..
No comments:
Post a Comment