Wednesday, 23 December 2020

అవసరం.....ఆశ

 ఒకడికి డబ్బు అవసరం వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు..

అది గమనించిన వేరే వ్యక్తి అతన్ని ఆపి,

ఒక పరిక్ష పెట్టాడు. . .

'' నువ్వు ఎండలో బండ మీద 10 నిమిషాలు నిలబడితే 1000 ఇస్తా అన్నాడు కనిపించే ఒక బండను చూపిస్తూ..

అవతలి వ్యక్తికి డబ్బు అవసరం గనుక కాళ్ళు కాలుతున్నా సరే అలానే నిలబడ్డాడు. .

వాడు సారి 5 నిమిషాలకే 1000 ఇస్తా నిలబడమన్నాడు..

వాడు సరే అని కాళ్ళు ఎర్రగా కందిపోతున్నా అలానే నిలుచున్నాడు. .

సారి వాడు 1 నిమిషానికి 1000 అన్నాడు..

అప్పటికే అవసరమైనంత డబ్బు వచ్చేసింది, పైగ స్పృహకోల్పోడానికి సిద్దంగా ఉన్నాడు అయినా సరే డబ్బు మీదా ఆశతో బలవంతంగా అలానే నిలుచున్నాడు. .

చివరిగా సారి సెకనుకి 100000 అన్నాడు..

ఒంట్లో శక్తినంతా కూడదీసుకొని నిలబడటానికి ప్రయత్నించి ఎండ తీవ్రతకు తట్టుకోలేక చచ్చిపోయాడు. . !

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

అవసరానికి, ఆశకి మధ్య కంటికి కనిపించేంత చిన్న దారం ఒకటి ఉంటుంది., దారాన్ని మనం సరిగ్గా చూసుకోకుండా దాటామో. .?

మనల్ని ఇంకెవరో చూసుకోవల్సిన పరిస్ధితి వస్తుంది. . .!

ఒక ముద్దకు మించి మనం నోరు తెరవలేం. .

పాదాలు సాగినంత వరకే మన అడుగులు వేయగలం. .

అలాంటిది మన ఆశను మాత్రం హద్దు ఎందుకు దాటనివ్వాలి. .

No comments:

Post a Comment