Wednesday, 23 December 2020

రెండు రామచిలుకలు

   ఒక దట్టమైన అరణ్యంలో ఒక చెట్టుపై రామచిలుకలు గూళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. ఒక రామ

చిలుక తన గూటిలో గుడ్లు పెట్టింది. ఒక రోజు గాలి కాస్త ఎక్కువ వీసి ఒక గుడ్డు అటూఇటూ కదిలి కింద నేలపై పడి ముక్కలై చిలుక పిల్ల ఒకటి

బైటకి వచ్చింది. ఎగరడానికి సాధ్యం కాక స్వయంగా ఆహారం వెతుక్కోలేక నిస్సహాయంగా వుండిపోయి దిక్కు

తోచని స్థితిలో వుండిపోయింది.


  అటుగా వచ్చిన ఒక వేటగాడిది చూసి చిలుకపిల్లపై జాలిపడి తన గుడిసెకు తీసుకుపోయి పెంచు

కోసాగాడు. ఇది జరిగిన మరికొంత

సేపటికి ఇంకొక గుడ్డు కూడా చెట్టు

నుండి క్రిందపడిపోయి ఇదేరీతిలో

ఇంకొక పిల్ల వెలుపలికి వచ్చి యాతనపడసాగింది. అటుగా వెళుతున్న ఒక మునివర్యుడది గమనించి జాలిపడి తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. రెండు చిలుకలు

పెంపుడు చిలుకలై వారి గృహములకు

ఆనందం కలగ జేస్తూన్నాయి.


  ఒకరోజు దేశపు మహారాజు వేటకై అడవికి వచ్చాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు. దాహం వేసింది. నీటి

కోసం వెదకుతూండగా వేటగాడి గుడిసె కనపడింది. లోపలికి ప్రవేశించగా పంజరంలో వున్న చిలుక సంస్కారహీనంగా ఇలా మాట్లాడింది.


  " ఎవరో ఒక దొంగ వచ్చాడు. వీడిని 

కట్టిపడేసి బాగా తన్నండి."


  అనాగరకమైన పలుకులు విని రాజు దిగ్భ్రాంతికి లోనై --


  " ఇటువంటి కుసంస్కారుల ఇంటికి ఎవరు వెళతారు? మరోచోటుకుపోయి నీళ్లకోసం ప్రయత్నిస్తాను." అనుకుని బైటకు వచ్చి కాస్తముందుకి నడవగా

ఒక ముని ఆశ్రమం కనపడింది. బ్రతుకుజీవుడా! అనుకుంటూ దప్పికతో లోనికి ప్రవేశించగా అక్కడ పంజరంలో వున్న చిలుక --


  "అయ్యా! రండి,రండి. మీకు స్వాగతం. మునివర్యులు బైటకు వెళ్లారు. కొంచెం సేపట్లో వస్తారు. మీరు

లోపలికి వచ్చి విశ్రమించండి. అక్కడ ప్రక్కనే పాలు, కొన్ని పళ్లు, చల్లని నీరు వున్నాయి.  సేద తీరండి. పిదప కాసేపు నడుం వాల్చండి."  అని సంస్కారం వుట్టిపడే పలుకులతో రాజును ఆహ్వానించింది. సంతోషంగా రాజు దాహం తీర్చుకుని బడలిక తీరేవరకు విశ్రమించాడు.


  తారతమ్యానికి కారణం " చిలుకలు పెరిగిన వాతావరణం, పొందిన శిక్షణే తప్ప వేరు కాదు."


  మురికినీరు మురుగు కాలువలో

చేరితే మురుగుగానేవుండిపోతున్నది. 

అదే నీరు గంగానదిలో చేరితే పవిత్ర గంగాజలంగా మారుతున్నది.

దుర్యోధనుని సాంగత్యం వలన కర్ణుడు నేరచరిత్రుడుగా మిగిలి

పోయాడు. జన్మతః రాక్షసుడై వుండి

కూడా విభీషణుడు శ్రీరాముని సాంగత్యం నెరపి శాశ్వత

కీర్తిని సముపార్జించుకున్నాడు.

No comments:

Post a Comment