ఒక ఊరిలో ఒక గొల్ల వాడు ఉండేవాఢు.
వాడికి ఉన్న నాలుగు ఆవులే వాడి జీవన ఆధారం.
ప్రతిరోజు వాడి ఊరు ప్రక్కన ఉన్న అడవికి వెళ్ళి ఆవులని మేపుకుని వచ్చేవాడు.
ఒకరోజు వాడికి జ్వరం వచ్చింది.
వాడు పనిమానేస్తే ఇంటిల్లిపాది పస్తులు ఉండాలని.... ఆవులను మేపడానికి వెళ్ళిపోయాడు .
ఆవులను పచ్చిక దగ్గరగా ఉన్న చెట్టుకి కట్టాడు అవి ఆహారం కోసం అడవి లో...పలికి వెళ్ళిపోకుండా .
జ్వరం వల్ల చలిగా ఉంటే ఒక గోనె కప్పుకుని ఒక బండరాతిమీద ఎండలో పడుకున్నాడు.
జ్వరానికి కోపం వచ్చింది. నేను వచ్చానన్న భయం కూడాలేకుండా పనిలో దిగాడు...... పైగా గట్టిగా ఉండే రాతి మీద మండిపోతున్న ఎండలో పడుకున్నాడు పైనుండి ఈ గోనె ఒకటి గరుకుగా వేడిగా చికాకుగా ఉంది ... దీనికి తోడు పంతులు లంఖణం పరమౌషధం అన్నాడుట చద్ది తినలేదు తెచ్చుకోలేదు అని తట్టుకోవడం ప్రారంబించింది... ఈలోగా సధ్య కావడంతో ఇంటికి బయలుదేరాడు ఇప్పుడు నడుస్తాడు కూడానేమో అని ఇంత అవమానం జరిగాక వీడి ఒంట్లో ఒక్క క్షణం ఉండను ..అని ఉదయం వచ్చిన జ్వరం సాయంత్రానికే వెళ్ళిపోయింది.
కానీ ఎక్కడకి వెళ్ళాలా అని ఆలోచించి.... ఆ దేశపు రాజుగారి దగ్గరకు వెళ్ళింది....
సేవకులు గాభరాపడి రాజ వైద్యుడుని పిలిచి ఔషద సేవలుచేసి ఆడవారు వింజామరలు వీచారు, మెత్తటి పరుపులపై పడుకోబెట్టి పత్యాలు గట్రా తినిపిస్తున్నారు, స్వయంగా మహారాణీ వచ్చి పాదాలు వత్తుతున్నారు తలకి గంధ లేపనాలు గదిలో సుగంధద్రవ్యాల పరిమళాలు ఆహా ఇంత రాచ మర్యాదరు జరుగుతుంటే జ్వరానికి చాలా ఆనందం వేసిందిట. ఓ పది పదిహేను రోజులు హాయిగా గడిపి వెళ్ళిందిట.
ఇందులో మీరు నేర్చుకున్నది ఏంటి అని మా తాతగారు అడిగితే మేము సమాధానం ఇచ్చాం....
మరి మీరు అందరూ కూడా చెప్పండి...
మీకు ఏమి అర్థం అయ్యిందో...
No comments:
Post a Comment