ఇంద్రియాలను నిగ్రహించటం ద్వారాను, మనస్సును విషయాల అనిత్యతను తెలుసుకొనేట్లు చేసి శాంతంగా ఉంచటం ద్వారాను - ఆ శాంత మనస్సును లక్ష్యంపై తేలికగా నిలపవచ్చు.
అంటే శమదమాలతో శుద్ధమైన మనస్సు లక్ష్యంపై నిలిచి ఉంటుంది.
ఇలా మనస్సు లక్ష్యంపై పూర్తిగ నిలిచి ఉందంటే మనస్సు ఇక తన చుట్టూ విషయాలు, వస్తువులు, భోగాలు ఉన్నా సరే వాటి వైపు పరుగులెత్తదు. చలించదు.
ఎదురుగా ఆటబొమ్మలున్నప్పటికి పెద్దల మనస్సు చలించదు.
కార్లలో తిరిగే వాడి మనస్సు స్కూటర్ మీదకు చలించదు.
శాకాహారికి మాంసం ఎదురుగా ఉన్నా మనస్సు మళ్ళదు.
అలాగే ఆత్మలో మనస్సు నిలిచిన యోగికి ఎదురుగా ప్రాపంచిక వస్తువులు, విషయభోగాలు ఉన్నా మనస్సు చలించదు.
అలా చలించకుండా శాంతంగా లక్ష్యంపై నిలిచి ఉండటాన్నే మనస్సు ఉపరతిలో ఉన్నది అంటాం.
నిజంగా ఈ శమదమాలు ఉపరతి లౌకిక వ్యవహారాలలో ఉన్నవారిలో కూడా ఉంటుంది.
ఒక సైంటిస్ట్ లోను, ఒక గొప్ప పారిశ్రామిక వేత్తలోను, ఉత్తమ విద్యార్థిలోను, బాణవిద్యను సాధన చేసే వానిలోను, ఏ వృత్తిలోనైనా నైపుణ్యం సాధించిన వానిలోను -----
ఇంద్రియాలు అధీనంలో ఉంటాయి.
మనస్సు చేసే పనిమీద ఏకాగ్రం అవుతుంది. చేసేపనిలో ఆనందం పొందుతాడు. అయితే వేదాంతంలో ఇవి చాలా ఎక్కువగా ఉండాలి.
No comments:
Post a Comment