Wednesday, 23 December 2020

_*💫 ఆత్మస్థైర్యం 🥀*_

 _*ఒక చిన్న గదిలో నాలుగు  మైనపు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఇంతలో పెద్దగా గాలి రావడం  మొదలయింది.*_  

_*ప్రశాంతత అనే మైనం.. గాలికి నేను ఆరిపోతానేమో అని  భయపడింది గాలి రావడంతో ఆరిపోయింది.*_

_*ప్రేమ అనే మైనం కూడా.. గాలిని నేను కూడా తట్టుకోలేను నేను ఆరిపోతానేమో అని అనడంతో రెండో దీపం కూడా ఆరిపోయింది.*_   

_*తెలివి అనే దీపం.. నేను గాలిని ఎదిరించి వెలగలేనేమో అని భయపడుతూ గాలికి ఆరిపోయింది.*_ 

_*నాలుగో దీపం మాత్రం.. నేను ఎలాగైనా గాలిని ఎదిరించి వెలుగు ఇవ్వాలి. ఆరిపోకూడదు అని తన వంతు ప్రయత్నం తాను చేసింది. గాలిని ఎదిరించి వెలిగింది.*_  

_*దీపాలు ఉన్న గదిలోకి చిన్న పిల్లవాడు వచ్చి అయ్యో మూడు దీపాలు ఆరిపోయాయే అని బాధ పడ్డాడు.*_

_*బాధ పడుతున్న అబ్బాయిని చూసి దీపం ఇలా చెప్పింది. బాధపడకు నేను ఉన్న కదా, నా నుండి మూడు దీపాలు వెలిగించుకో అన్నదట...*_ 

_*సంతోషంతో పిల్లవాడు నాలుగో దీపాన్ని నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు నమ్మకం అని చెప్పింది దీపం.*_

_*అన్ని పోగొట్టుకున్నా మనపైన మనకు నమ్మకం ఉంటే చాలు  పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించేసుకోగలం.*_

_*ఒక పిరికివాడు శ్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా శ్మశానం దాటేశాడు.. ఇంతకీ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట ! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని శ్మశానం దాటేలా చేసింది.*_

_*నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం... ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు.. మనిషికి ఎంత బలం వస్తుందో... బలంతో మనిషి ఏదైనా చేయగలడు.*_

_* సారి ఒకాయన తన కారులో గ్రామానికెళ్తుంటే, కారు దారిలో బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితి చూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు !*_

_*రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే ! రాజు కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.*_

_*పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్లు అదిలించారు ?"*_

_*రైతు," రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా ! ఐతే, తను కాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే ! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!" రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ నగరవాసి తలమునకలయ్యాడు !*_

_*పూర్వం10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అలాంటి ధైర్యమే కారణం.. ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.*_

_*కాని రోజుల్లో ఒక్క పిల్లో, పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం !*_

_*కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి. ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి.. మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.*_

_*ప్రతి ఒక్కరి కథా కంచికి చేరుతుంది. ఆలోపునే మనం మనుషులుగా ఎదగాలి !*_ 

🙏🇮🇳😷🌳🏵️🤺🥀🌞🌎

No comments:

Post a Comment