ఈ జగత్తులో ప్రతి వ్యక్తికీ ఏదో ఒకవిధమైన బలహీనత తప్పక ఉంటుంది. ఎలాగంటే ఒకడు బాహువేగంతో పరుగెత్తలేకుంటే మరొకడు అధిక భారం మోయలేకపోవచ్చు. ఒకడు చికిత్స లేని రోగంతో బాధపడుతుంటే ఇంకొకడు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు.
ఇలాంటి ఉదాహరణలు అనేకానేకం ఉన్నాయి. జీవితం లో సర్వమూ ప్రాప్టించినవాడు ఎవరినైనా మీరు ఎఱుగుదురా ? కానీ మనం జీవితాంతం ఒక్క బలహీనతను జీవితానికి కేంద్రంగా భావిస్తుంటాం. ఈ కారణం వల్లనే హృదయం లో దుఃఖం ఇంకా అసంతృప్తి సదా ఉంటాయి. దౌర్భల్యం అన్నది మనుషుల జన్మతః నో లేక ప్రమాదవశానో ఏర్పడుతుంది. కానీ ఆ దౌర్భల్యాన్ని చాలామంది మనుషులు తమ పరిధిగా భావిస్తారు.
కానీ కొందరు వ్యక్తులు ఇలా కూడా ఉంటారు. వారు తమ పుషార్థంతోనూ , శ్రమతోను వారి దౌర్భల్యాన్ని పరాజితం చేస్తారు. మరి వారికి, ఇతరులకి ఉన్న బేధమేమిటి..? ఎప్పుడైనా ఆలోచించారా..?
దీనికి సమాధానం సరళమైనదే. ఏ వ్యక్తి అయితే దౌర్భల్యం వల్ల పరాజితుడు కాడో , ఎవరైతే పురుషార్థాన్ని నెరవేర్చాలని సాహసం గుండెల్లో నింపుకుంటారో, వారు దౌర్భల్యాన్ని అధిగమించి వెళ్తారు. అంటే దౌర్భల్యం అనేది ఆ ఈశ్వరదత్తమే. కానీ పరిధులని ఏర్పరచుకొనేది మనుషుల మనసే.. :)
No comments:
Post a Comment