Friday, 25 December 2020

చిన్న కుక్క కథ

 ఒక కిరాణా షాపు వాడి దగ్గరకు బుద్దిగా ఒక కుక్క వచ్చింది ..


నోట్లో సంచీ, సంచీ లో  ఒక సరుకుల లిస్ట్, వాటికి సరిపడా డబ్బూ ఉన్నాయి .

ఆశ్చర్య పోయిన షాపు అతను లిస్ట్ ప్రకారం సరుకులు సంచీ లో వేసి  ( బిల్లూ, మిగత చిల్లర తొ సహా ) ఆ కుక్క నోటికి అందించాడు . అది తోక ఊపి తీసుకుని వెళ్ళి పోయింది.


షాప్ అతనికి ఆసక్తి పెరిగి దాన్ని వెంబడించ సాగాడు . ఆ కుక్క దగ్గర్లో బస్ స్టాప్ కెళ్ళి నుంచుని ఒక బస్ రాగానే ఎక్కింది . మన షాపు ఓనరూ ఎక్కాడు . కుక్కేమో కండక్టర్ ని చూసి తోక ఆడిస్తూ తన మెడలోని బెల్ట్ ఊపింది. అందులో అది దిగాల్సిన బస్ స్టాప్, సరిపడా డబ్బూ ఉన్నాయి . కండక్టర్ డబ్బు తీసుకుని టికెట్ మళ్ళీ దాని మెడ బెల్ట్ లో పెట్టాడు . 


ఆ బస్ స్టాప్ వచ్చాక దిగి తన యజమాని ఇంటికి బయలుదేరింది . వెనకే ఆశ్చర్యంతో  షాపు యజమాని కూడా ..

ఇంటికి వెళ్ళి సంచీ కింద పెట్టి కాళ్ళతో ఓ నాలుగైదు సార్లు  తలుపు తట్టింది.


ఇదంతా గమనిస్తున్న షాపు యజమాని కుక్క తెలివి తేట లకు నోటమాట రాక దాని యజమానికి తన అభినందనలు చెప్పడానికి, వీలైతే వాళ్లతో సెల్ఫీ కి కూడా రెడీ అయిపోయాడు.


కుక్క యజమాని తలుపు తీసి ...

....

.....


కుక్కను పాపం కర్రతో చితక బాదేశాడు !!!

..

...

అది చూసిన షాపు ఓనరు " ఏంటండీ ... మీ కుక్క ఎంత తెలివైనది తెలుసా .... ఆలా కొడతారా ..???" అని అడిగాడు ...


అప్పుడు ఆ కుక్క ఓనరు " ఏం తెలివీ ?? నన్ను నిద్ర లేపేబదులు ఇంటి తాళం తీసుకెళ్లచ్చు కదా" అని విసుగ్గా అన్నాడు !!


ఎంత చేసినా, ఏమి చేసినా, ఎవరికోసమైతే చేస్తున్నామో వాళ్ళు సంతృప్తి చెందకపోతే అంతా వృధా నే.

No comments:

Post a Comment