Wednesday, 23 December 2020

మన ఆచారాలు..ఆంతర్యాలు

 *శయన నియమాలు*

పడుకోవాలంటే పాటించే పదహారు సూత్రాలు:

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

1. *నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో* ఒంటరిగా పడుకోవద్దు.

*దేవాలయం* మరియు *స్మశానవాటికలో* కూడా పడుకోకూడదు.

*(మనుస్మృతి)*

2. పడుకుని ఉన్న వారిని *అకస్మాత్తుగా* నిద్ర లేపకూడదు.

*(విష్ణుస్మృతి)*

3. *విద్యార్థి, నౌకరు, ద్వారపాలకుడు* వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలపవచ్చును.

*(చాణక్య నీతి)*

4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం *బ్రహ్మా ముహూర్తం* లో నిద్ర లేవాలి.

*(దేవీ భాగవతము)*

పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు.

*(పద్మ పురాణము)*

5. *తడి పాదము* లతో నిద్రించవద్దు.

పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి(ధనం)ప్రాప్తిస్తుంది.

*(అత్రి స్మృతి)*

విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం.

*(మహాభారతం)*

6. *నగ్నంగా, వివస్త్రలులై* పడుకోకూడదు.

*(గౌతమ ధర్మ సూత్రం)*

7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన *విద్య,* పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన *హాని, మృత్యువు,* ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో *ధనము, ఆయువు* ప్రాప్తిస్తుంది.

*(ఆచార మయూఖ్)*

8. *పగటిపూట* ఎపుడు కూడా నిద్రించవద్దు.

కానీ *జ్యేష్ఠ మాసం* లో

1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.

(పగటిపూట నిద్ర రోగహేతువు మరియు ఆయుక్షీణత కలుగచేస్తుంది)

9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు *రోగి* మరియు *దరిద్రులు* అవుతారు.

*(బ్రహ్మా వైవర్తపురాణం)*

10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు గంటల) తరువాతనే *పడుకోవాలి*

11. ఎడమవైపు పడుకోవడం వలన *స్వస్థత* లభిస్తుంది.

12. దక్షిణ దిశలో *పాదములు* పెట్టి ఎపుడు నిద్రించకూడదు.

*యముడు* మరియు *దుష్ట గ్రహము* నివాసము ఉంటారు.

దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది.

*మెదడుకు రక్త సరఫరా* మందగిస్తుంది. *మతిమరుపు, మృత్యువు* లేదా

*అసంఖ్యాకమైన రోగాలు* చుట్టుముడుతాయి.

13. గుండెపై చేయి వేసుకుని, *స్లాబు యొక్క బీము* కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.

14. పడక మీద *త్రాగడం- తినడం* చేయకూడదు.

15. పడుకొని *పుస్తక పఠనం* చేయడానికి వీల్లేదు. (పడుకొని చదవడం వలన *నేత్ర జ్యోతి* మసకబారుతుంది)

16. నుదుటన బొట్టు లేదా తిలకం ధరించి నిద్రించడం *అశుభం* కావున పడుకొనే ముందు తీసివేయండి.

* పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, దీర్ఘాయుష్మంతులు అవుతారు.*

No comments:

Post a Comment