భాగవతం 12 అంతస్తుల భవనం. దాని నిర్మాత శ్రీమహావిష్ణువు. ఈ భవన నిర్మాణం జరిగి చాలాకాలమైనా నిత్యనూతనంగా ఉంది. భాగవత భవనంలో ప్రవేశించి ఎందరో తరించారు. అనేకులు తరిస్తున్నారు. ఇంకా ఎందరో తరించనున్నారు. ఆభవనంలో ప్రవేశించిన భాగవతులు ఎవరు, ఎలా తరించారో తెలుసుకుందాం.
ఈ భాగవతం పరీక్షిత్తు మహారాజుకు శుకమహర్షి భోదించారు. శృంగి శాపంతో రాజు చనిపోయాడు, ఏడు సంవత్సరాల వయసు కలిగిన శృంగికి పరిక్షిత్తుకి శాపం పెట్టగలిగే శక్తి ఎలా వచ్చింది అనే సందేహానికి సమాధానం శృంగి వెనుక 21 తరాలవారు అబద్దం ఆడక సదాచార సంపన్నులై ఉన్నారు. ఆ ప్రభావంతోనే శృంగికి శాప శక్తి కలిగింది.
శాపగ్రస్తుడైన పరీక్షిత్తు శుకులవారితో మహాత్మా, శృంగి శాపం వల్ల నాకు ఏడు రోజులలో మృత్యువు తప్పదని తెలుసుకున్నా, మృత్యువు వల్ల నాకు భయం లేదు. కానీ మిమ్మల్ని నేను ఈ ఏడు రోజులలో మోక్షమునకు మార్గం తెలుపమని ప్రార్ధిస్తున్నాను అన్నాడు.
రాజా.. కలియుగ మానవులకు దేనివల్ల దుఃఖ నివృత్తి, మోక్షప్రాప్తి ఎలా లభిస్తుందో ఆ సులభ ఉపాయం నీవు శ్రద్దగా విను అంటూ శుకమహర్షి ఇలా చెప్తున్నారు.
మనిషి ఆయుష్షుని రాత్రి పగలు అనే రూపంతో సూర్యచంద్రులు హరించివేస్తున్నారు. అది తెలియక ఇంకా చాలా కాలం జీవిస్తామని కొందరు, అసలు మనకు మృత్యువు ఉంది అని కలలో కూడా తెలియని మహానుభావులు కోకొల్లలుగా ఉన్నారు.
ఈ మాయా మోహంలో పది కాలాన్ని, మృత్యువును మరిచిన మనుషులను యమభటులు వచ్చి తీసుకుపోతున్నప్పుడు పాపినై పుణ్యానికి దూరమయ్యానని పశ్చాత్తాపపడితే ప్రయోజనం ఏమిటి? పవిత్రమైన మానవ జన్మకు మట్టి కలిపినట్లే కదా. మళ్ళీ రమ్మంటే వస్తుందా ఈ మానవజన్మ..? కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. భక్తులలో అగ్రగణ్యురాలైన కుంతీ దేవి శ్రీకృష్ణ పరమాత్మనే తన సర్వస్వంగా భావించి తరించిన సాధ్వి, చేసిన మేలును మరవకూడా ఆమె పరమాత్మను స్తుతించిన తీరు. ఇలా ఉన్నది.
"మహాత్మా.. నీ దయవల్ల పాండవ వంశాంకురమైన పరీక్షిత్తు జననం కలిగింది. పాండవ వంశ దీపాంకురానికి నీ డయ్యు కారణం. నా హృదయం సంతోషంతో నిండిపోయింది. భక్తవరదుడివైన నీవు నేను కోరే వరాన్ని ఇవ్వడానికి బాధపడతావు, మాకు చేసిన మేలు చాలు. నీవు ద్వారకకు విచ్చేయి తండ్రి అని అన్నది.
భక్తుల కోరిక మేరకు వరాలు ఇచ్చి వారి అభీష్టాలు తీర్చడం నా కర్తవ్యమ్ కదా తల్లీ, వరం కోరుకోమన్నాడు స్వామి చిరునవ్వుతో.
ఆ మాటకు కుంతీ దేవి, " మహాత్మా, నీవు నాకు వరం ఇవ్వదలిస్తే నా జీవితాంతం వరకు నాకు కష్టాలు, బాధలు తొలగకుండా ఉండేలా అనుగ్రహించు" అంది.
దానికి శ్రీకృష్ణభగవానుడు, "బాల్యం నుండి నీ జీవితం కష్టాలతోనే నడిచింది. ఇంకా ఎందుకు మాతా నీకు ఈ వరం" అని అడిగారు.
దానికి ఆమె "కష్టాలలో ఉండబట్టే కదా నీవు ద్వారక ను విడిచి , భార్యలను విడిచి , నీ బంధువులను, పుత్రులను, మిత్రులను విడిచి మాతోనే ఉన్నావు. మేము ఐశ్వర్యంతో, వైభవంతో విలసిల్లి ఉంటె నీవు మా దరిదాపులకు కూడా రావు కదా కృష్ణా.. నీతోటి జీవితమే సంపద.. నీ మరపే ఆపద " అంది కుంతీదేవి. ఇది భాగవతం మొదటి అంతస్థులో కుంతీ దేవి సాధించిన ఘనత.
https://t.me/koorellaBhagavatham
No comments:
Post a Comment