Friday, 1 April 2022

జట్కావాలా

 ఒక బాలుడికి జట్కాబండిలో ప్రయాణించడం చాలా ఇష్టం. రోజూ బడికి జట్కాలోనే వెళ్లేవాడు.

పెద్దయ్యాక ఏం కావాలనుకున్నారని స్కూల్లో టీచరు అడిగారు.

ఒకరు డాక్టరని,

ఇంకొకరు ఇంజినీరని,

మరొకరు లాయరని

అన్నారు.

బాలుడు మాత్రం జట్కావాలా అవుతానన్నాడు.

టీచరు, పిల్లలు ఘొల్లున నవ్వారు. 

ఇంటికెళ్లేలోపే ఇది బాలుడి తల్లికి తెలిసి, ప్రశాంతవదనంతో

బాబూ! పెద్దయ్యాక ఏమవుతావని అడిగింది.

స్కూళ్లో చెప్పిందే చెప్పాడు.


తల్లి:

"అలాగే అవుదువుగానీ, ఇలా రా"

అంటూ పూజామందిరం తలుపులు తెరిచి,

"ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు! నాలుగు గుర్రాలు నడిపే బండీకి నువ్వు జట్కావాలావి కావాలి, అదిగో శ్రీకృష్ణుడి లాగా" అని బోధించింది తల్లి


4గుర్రాల పేర్లు

*ధర్మ, అర్థ, కామ, మోక్షాలనీ*,

*బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణుడనీ* చెప్పింది.

"నువ్వు కూడా జగత్తుకి

నాలుగింటిని బోధించే గురువువి కావాలి, సరేనా!" అంటూ అతడిఆలోచనను మలుపు తిప్పింది.


బిడ్డడే పెద్దయ్యాక వివేకానందుడయ్యాడు.


పెంపకం అంటే అదీ!

పిల్లలు తెలియక తప్పు చేసినా,

తప్పు మాట్లాడినా

దానిని సరిదిద్దాల్సింది తల్లే!


*అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు.*

అమ్మ మాటలో ఎంతో మహత్తు వుంది కదా   🌹                      .

No comments:

Post a Comment