ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం శ్రీ గురుభ్యోనమః`
ప్రథమాధ్యాయము.
అర్జున విషాదయోగః
11
ఆయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభి రక్షన్తు భవన్త : సర్వ ఏవ హి ||
ఆయనేషు = ముఖ్యమైన స్థానములందు ; చ = కూడా ; సర్వేషు = సర్వత్రా ; యథాభాగం = వివిధంగా ఏర్పాటు చేయబడినట్లుగా ; అవస్థితాః =ఉన్నవారై ; భీష్మమ్ = పితామహుడైన భీష్మునికి; ఏవ = నిశ్చయంగా; అభిరక్షన్తు=రక్షణ సమకూర్చవలెను ; భవన్త =మీరు; సర్వే =అందరూ ; ఏవ హి =నిశ్చయంగా
భావం: సేనావ్యూహ ద్వారంలో మీ ముఖ్య స్థానాలలో నిలిచి ఉంది మీరు పితామహుడు భీష్మునికి సంపూర్ణ రక్షణను సమకూర్చవలసి ఉంది.
భాష్యం: భీష్ముని నైపుణ్యాన్ని ప్రశంసించిన తర్వాత దుర్యోధనుడు ఇతరులు తమని తక్కువ ప్రాముఖ్యం కలిగిన వారిగా అనుకుంటారేమో అని భావించాడు. అందుకే, తన సహజమైన రాజనీతి పద్దతిలో ఈ మాటల ద్వారా పరిస్థితిని చక్కబరచాలని ప్రయత్నించాడు.
భీష్ముడు నిస్సందేహంగా గొప్ప వీరుడే . కానీ ఆయన వృద్ధుడు కావడం వల్ల ప్రతి ఒక్కరు అన్నివైపుల నుంచి పితామహుని రక్షణ గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని అతను చెప్తున్నాడు. అతను యుద్ధంలో నిమగ్నుడైనప్పుడు మరోపక్క అతని స్థితిని శత్రువులు అవకాశంగా తీసుకోవచ్చు. కాబట్టి ఇతర వీరులు అందరూ తమ తమ ముఖ్య స్థానాలు వదలకుండా, సేనావ్యూహాన్ని శత్రువు భేదించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండడం ముఖ్యం. కౌరవుల విజయం భీష్ముని సమక్షం పైనే ఆధారపడి ఉందని దుర్యోధనుడు స్పష్టంగా భావిస్తున్నాడు. యుద్ధంలో భీష్ముడు, ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారంతో అతను సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాడు. సభలో మహా సేనా నాయకుల సమక్షంలో నగ్నంగా నిలపడానికి బలవంతం చేసే సమయంలో అర్జునుని ధర్మపత్నియైన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కోసం అర్ధించినప్పుడు వారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడమే అందుకు కారణం. ఆ ఇద్దరు సేనానులు పాండవుల పైన ప్రేమ కలిగి ఉన్నారని తెలిసినా, ద్యూత సభలో వారి ప్రవర్తనని బట్టి ఆ ప్రేమను, మమకారాన్ని పూర్తిగా వదిలేస్తారని అతను ఆశించాడు.
No comments:
Post a Comment