Wednesday, 6 March 2024

మార్ష్ మల్లో సిద్ధాంతం

నిజంగా ఓర్పు అనేది  పరీక్ష. 

ఒక పాఠశాలలో క్లాస్ టీచర్ తన క్లాస్ లోని పిల్లలందరికీ కమ్మని మిఠాయి పంచి ఒక విచిత్రమైన షరతు పెట్టారు. 

ఆయన "మరో పది నిమిషాలవరకు మీరందరూ ఈ మిఠాయి తినకూడదు" అని చెప్పి తరగతి గది నుంచి వెళ్లిపోయారు. 

ఆ తరగతి గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది. పిల్లలందరూ తమ ముందు ఉన్న మిఠాయి వైపు చూస్తున్నారు. 

గడిచే ప్రతి క్షణం వారి ఆత్రుతని అదుపులో ఉంచుకోవడం చాల కష్టం గా  ఉంది. 


పది నిమిషాల తర్వాత టీచర్ ఆ క్లాస్ రూమ్ లో కి ప్రవేశించారు. పరిస్థితిని సమీక్షించారు. 

ఆ తరగతి గదిలో మిఠాయిలు తినని పిల్లలు ఏడుగురు ఉన్నారని గుర్తించారు. 

మిగిలిన పిల్లలందరూ మిఠాయి తినేసి దాని రంగు, రుచి గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు.

 ఉపాద్యాయుడు తన డైరీ లో ఈ ఏడుగురు పిల్లల పేర్లను రహస్యంగా నమోదు చేసుకొని తాను చెప్పాల్సిన పాఠం చెప్పి వెళ్లిపోయారు. 

ఆ ఉపాధ్యాయుడి పేరే "వాల్టర్ మిషెల్. " 

కొన్నేళ్ల తర్వాత వాల్టర్ తన డైరీ తెరిచి ఆ ఏడుగురు పిల్లల పేర్లను బయటికి తీసి వారు ఇప్పుడు ఎం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నాడు. 

ఆ ఏడుగురు చిన్నారులు తమ తమ రంగాల్లో మంచి విజయాలు సాధించారని తెలుసుకున్నాడు. 

అదే తరగతికి చెందిన మిగిలిన విద్యార్థులు గురించి కూడా ఆరా తీశారు. వారిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని, కొంతమంది ఆర్ధికంగా, సామాజికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నారని కూడా తెలుసుకున్నాడు. 

వాల్టర్  తన పరిశోధనను ఈ ఒక్క వాక్యం లో ముగించారు. 

"కేవలం ఒక్క పది నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు " అనేదే ఆ వాక్యం. 

ప్రపంచ ప్రఖ్యాతిని పొందింది ఈ పరిశోధన. 

ఉపాధ్యాయుడు వాల్టర్ పిల్లలకు ఇచ్చిన మిఠాయి "మార్ష్ మెల్లో " అవడం వల్ల  ఇది "మార్ష్ మెల్లో  సిద్ధాంతం" అని పిలువబడింది. 

ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచం లో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్యలక్షణాలతో పాటుగా 'ఓర్పు'ని కూడా కలిగి ఉంటారు. 

ఓర్పు ఒక వ్యక్తి యొక్క సహన శక్తిని పెంచుతుంది. కాబట్టి అతను ప్రతికూల పరిస్థితులలో కూడా నిరుత్సాహపడడు. తనకి తానుగా ప్రేరేపించుకుంటూ విజయవంతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుంటాడు. 

No comments:

Post a Comment