ఒకసారి అబ్దుల్ కలాంని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఒక రిపోర్టర్. అదేసమయం లో ఆయన ఉంటున్న అధికారక బిల్డింగ్ ప్రహరీ గోడకి రక్షణ కోసం పైభాగం లో గాజు పెంకులు పోస్తున్నారు. అది గమనించిన కలాం గారు "వద్దు గాజుపెంకులు వేయకండి" అన్నారట. దానికి ఆ పనిచేస్తున్న వాళ్ళు "మీ సంరక్షణ కోసం, బయటినుంచి వచ్చే ప్రమాదాలు నిరోధించడానికి ఈ ఏర్పాటు చేయమని ప్రభుత్వం మమ్మల్ని నియమించింది" అని చెప్పారు. అప్పుడు ఆయన "చిన్న చిన్న పక్షులు ఉడుతలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ గాజుపెంకులు అక్కడ పోస్తే వాటికి గాయలవుతాయి కదా" అన్నారు.
ఈ మాట విన్న రిపోర్టర్ కలాం ని అడిగారు. "సర్, మీరు ఇంత సున్నిత హృదయులు కదా, మరి ఒక దేశాన్ని ఒక్కసారిగా నాశనం చేయగలిగే క్షిపణులు (Missiles ) ఎందుకు తయారు చేసారు" అని. అందుకు ఆయన ఇలా చెప్పారంట
"మన భారత దేశం ఏ శక్తి లేకుండా ఐక్యరాజ్యసమితి లో శాంతి ప్రవచనాలు వల్లిస్తూ కూర్చుంటే, సభ్యదేశాలు చేతకానితనం గా పరిగణించి పట్టించుకోకపోవచ్చు. కానీ, మన దేశం తాను అంత శక్తివంతమైన క్షిపణులు తయారు చేయగల సత్తా ఉండి కూడా శాంతికి ప్రాముఖ్యాతనిస్తే ప్రపంచ దేశాలు కూడా విలువనిస్తాయి, విధానాలను అనుసరిస్తాయి. ఆ అర్హత సంపాదించడానికి మన దేశానికి శక్తి ఉందని నిరూపించుకోకవలసి ఉంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ క్షిపణుల తయారీ. దాడి చేయడం ముఖ్య ఉద్దేశ్యం కాదు."
ఎంత గొప్పగా చెప్పారో కదా, ఒక అర్హత సంపాదించుకున్న తరువాతే మాటకి కానీ, చేతలకు కానీ విలువ.. అది ఎంత గొప్పదైనా..

No comments:
Post a Comment