Tuesday, 31 March 2020

మాట - అర్హత - విలువ

ఒకసారి అబ్దుల్ కలాంని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఒక రిపోర్టర్. అదేసమయం లో ఆయన ఉంటున్న అధికారక బిల్డింగ్ ప్రహరీ గోడకి రక్షణ కోసం  పైభాగం లో  గాజు పెంకులు పోస్తున్నారు. అది గమనించిన కలాం గారు "వద్దు గాజుపెంకులు వేయకండి" అన్నారట. దానికి ఆ పనిచేస్తున్న వాళ్ళు "మీ సంరక్షణ కోసం, బయటినుంచి వచ్చే ప్రమాదాలు నిరోధించడానికి ఈ ఏర్పాటు చేయమని ప్రభుత్వం మమ్మల్ని నియమించింది"  అని చెప్పారు. అప్పుడు ఆయన "చిన్న చిన్న పక్షులు ఉడుతలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ గాజుపెంకులు అక్కడ పోస్తే వాటికి గాయలవుతాయి కదా" అన్నారు.
ఈ మాట విన్న రిపోర్టర్ కలాం ని అడిగారు. "సర్, మీరు ఇంత సున్నిత హృదయులు కదా, మరి ఒక దేశాన్ని ఒక్కసారిగా నాశనం చేయగలిగే క్షిపణులు (Missiles ) ఎందుకు తయారు చేసారు" అని. అందుకు ఆయన ఇలా చెప్పారంట
"మన భారత దేశం ఏ శక్తి లేకుండా ఐక్యరాజ్యసమితి లో శాంతి ప్రవచనాలు వల్లిస్తూ కూర్చుంటే,  సభ్యదేశాలు  చేతకానితనం గా పరిగణించి పట్టించుకోకపోవచ్చు.  కానీ, మన  దేశం తాను అంత శక్తివంతమైన క్షిపణులు తయారు చేయగల సత్తా ఉండి కూడా శాంతికి ప్రాముఖ్యాతనిస్తే  ప్రపంచ దేశాలు కూడా విలువనిస్తాయి,  విధానాలను అనుసరిస్తాయి. ఆ అర్హత సంపాదించడానికి మన దేశానికి శక్తి  ఉందని నిరూపించుకోకవలసి ఉంది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ క్షిపణుల తయారీ. దాడి చేయడం ముఖ్య ఉద్దేశ్యం కాదు."

ఎంత గొప్పగా చెప్పారో కదా,  ఒక అర్హత సంపాదించుకున్న తరువాతే మాటకి కానీ, చేతలకు కానీ విలువ.. అది ఎంత గొప్పదైనా.. 

Sunday, 8 March 2020

నిజమైన ఆదర్శ మహిళలు ఎవరు?

* మహిళలు అంత వేడుకగా జరుపుకునే..ఈ మహిళ దినోత్సవం నాడు వివిధ రంగాల్లో ఉన్నతిని సాధించిన...మహిళలను ఆదర్శంగా చూపి వాల్ల ల ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని అందరూ చెప్తారు...
* కానీ ఎందుకు వ్యవసాయం చేసే మహిళను ఆదర్శంగా చూపరు.....???
తన రక్తాన్ని చెమట చుక్కలుగా...చేసి పండిస్తేనే కదా మన కడుపులు నిండేవి...???
మరి ఎందుకు తనని వేదిక పైకి పిలిచి సన్మానించరు...???
మొన్న నేను fb లో చదివిన కథ వ్యవసాయం చేసుకునే అలనాటి తెలంగాణ ఆడబిడ్డ కథ..
_____________________________________________________________________
* శ్రీ అల్లం రాజయ్య గారు రాసిన నీళ్ళమ్మ కథ మన తెలంగాణ భాషతో ,మన తెలంగాణ పల్లె సంస్కృతి కి అద్దం పడుతూ...తెలంగాణ పల్లె పడుచు జీవితాన్ని అద్దం లో చూసుకున్నట్టు చెప్పారు
(ఇక్కడ అందరూ కాదు ..ఎవరైతే అలాంటి హింసకు గురి అయి బాధలు అనుభవిస్తున్నారో వాళ్ళు మాత్రమే)
* బాల్యవివాహం చేసుకొని ఆ బాధ నుండి విముక్తి లభించిన మళ్ళీ తిరుగు బోతు, తాగు బోతు ఆయన భర్త తన జీవితం లోకి వచ్చిన తన వల్ల ఎన్నో బాధలు,కష్టాలు పడ్డ ఎంతో ఓర్పు తో నేర్పు తో తన బాధ్యతలు నిర్వహించింది...
**************************************
మొగుడు కొట్టిన దెబ్బల నుండి ఆ మగాడి బిడ్డకు జన్మ ఇచ్చే పురిటి నొప్పుల దాకా ఒక స్త్రీ శారీకంగా ,మానసికంగా ఎన్నో బాధలు అనుభవిస్తుంది..
దరిద్రం ఏంటి అంటే ఈ బాధలు అన్ని కూడా కట్నం పెట్టి బేరమాడి మరీ కొనుక్కోవడం..
కనీసం రాబోయే తరం అయిన ఈ కట్నం అనే దురాచారాన్ని కాలగర్భాన కలిపి ..వివాహం అనేది వ్యాపారం కాదు రెండు జీవితాల కలియక అని తెలిసుకోవలని ఆశిస్తున్నా...

సంగ్రహణ: మనకథలు,భావాలు భార్గవి స్వరూప్ బృందం 

మహిళా దినోత్సవం ?


అంతర్జాతీయ మహిళా దినోత్సవం 💐
మహిళలకు ప్రత్యేకంగా ఒకరోజు ఏంటండి అసలు , ప్రతిరోజు ప్రత్యేకతే ప్రతి మహిళకు .
ఉదయం , సాయంత్రం తేడా సూర్యచంద్రుల పరిభ్రమణం వలన మాత్రమే తెలుసుకుంటున్నాము . కానీ మహిళా పరిభ్రమణం తెలిసేదెలా?
సూర్యోదయానికి ముందే లేచి , అర్ధరాత్రివరకు అన్ని అమర్చినా చివరికి మిగిలే వాక్యం పొద్దునుంచి ఏం చేసావు ?
అంతరిక్ష్మలోకి ఎగిరినా... అంతరంగంలో శాంతి లేదేందుకని ?
అన్నింటా ముందే వుంటూ జీవితంలో మాత్రం వెనుకబడేది ఎందుకని ?
భయమే లేని ప్రపంచంకోసం భయం భయంగా పరిగెత్తడం ఎన్నాళ్ళో ?
నిజమైన మహిళాదినోత్సవం కోసం ఎదురుచూస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికి

సంగ్రహణ: మనకథలు,భావాలు భార్గవి స్వరూప్ బృందం 

ఆడ, మగ సమానమా? కానే కాదు

మహిళలను దేవతల్లా పూజించే దేశంలో పుట్టడం మన అదృష్టంగా భావించాలి.
అయితే మన దేశంలో స్త్రీని చిన్న చూపు చూసే పురుష జాతి కూడా అధికం.
అయితే ఈ ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకు వెళ్ళటం జరుగుతోంది.
ఇక తప్పనట్లు దాదాపుగా అందరూ....
"మహిళలూ పురుషులతో సమానమే"
అంటూ వివిధ స్థాయిల వ్యక్తులు అనేక చోట్ల తమ ప్రసంగాలలో విశాల హృదయంతో ఉటంకిస్తున్నారు.
అవునా..!? నిజమేనా...!? ఆడామగా సమానమా...!?
కానీ నాకనిపిస్తుందిలా......
అందరంటారు...
ఆడ మగ సమానమని...
కానీ వారికి తెలుసా..
చిన్నతనం నుండీ ఆమె
అతడి కంటే అదనంగా ఇంటి పని చేసి
అతడితో సమానంగా విద్యనభ్యసిస్తూ...
అతడి కంటే అధికమని...!?
వారికి తెలుసా...
ఆమెకు వయసొచ్చాక అదనంగా
అతని వంశాన్ని ఉద్దరించేందుకు
ప్రకృతి ప్రసాదించిన నెలసరి ఎరుపు నొప్పిని
అతడి కంటే అదనంగా భరిస్తోందనీ...!?
వారికి తెలుసా..
తన యవ్వనాన్నీ తడిమేసే
ద్రోహ ధృష్టులను దూరంగా
ఉంచేందుకుకు ఆమె కోల్పోయే స్వేచ్ఛ
అతడికి లేని అదనపు దైన్యమనీ...!?
వారికి తెలుసా....
తన వివాహంతో తన వారినందరినీ వదిలి
అడవిలో ఒంటరి లేడిలా
అతడింటికి బిక్కుబిక్కు మంటూ చేరి
అతనివారందరికీ సేవలు చేసి మెప్పించే
అదనపు బాధ్యత ఆమెపై పడిందనీ...!?
వారికి తెలుసా...
అతను గర్వంగా ముద్దాడే బిడ్డను
అతని చేతి కందించేందుకు
వేల ఎముకలనొక్కసారి పట్టి విరిచినట్టు
విల విలవిలలాడించే ప్రసూతి నొప్పులనోక్క
పిడికిట నొక్కి పెట్టి
మరణం అంచులదాకా వెళ్లి వచ్చి
చిరునవ్వుతో బిడ్డ నందిందించిన ఆమె
అతని కంటే ధీశాలనీ....!?
వారికి తెలుసా
అతనితో సమానంగా ఉద్యోగం చేస్తూ
ఇంటి బాధ్యతలూ చక్కద్దుతూ
భర్త కష్టాలకు మంత్రిత్వం చేస్తూ
అతనికంటే అధికంగా శారీరక,
మానసిక సమస్యలు మోస్తోందనీ...!?
వారికి తెలుసా...
అతడు మరణించినా ఆమె మొక్కవోని ధైర్యంతో
బిడ్డలను కడుపుకు కట్టుకొని
కర్మాగారాలలో మరయంత్రంలా నలుగుతూ
ఇంటా బయటా బాధ్యతలు నెత్తి కెత్తుకొని
ఒంటరిగానే పోరాడు తుంది తప్ప
అతనిలా బేలై మరో తోడుకు ఎదురుచూడదనీ ....!?
అందరంటారు ఆడ మగ సమానమని
అదెలా !? కానేకాదు!!
అతడెప్పటికీ ఆమెకు సమానం కాదు...
ఆమె ఎప్పటికీ అతని కంటే అన్నింటా అధికురాలే...
పురుషహంకార సమాజం చిన్నచూపు చూస్తున్న మహోన్నత మహిళే....!

సంగ్రహణ: స్వరూప్ జె. భార్గవి గారు, 
మనకథలు,భావాలు భార్గవి స్వరూప్ బృందం