Wednesday, 6 March 2024

బాల రైతు

 చంటి గాడికి ఐదేళ్ళు వచ్చాయి. "ఇహ ఆటలు కట్టిపెట్టి బడికి పోవాలి" అన్నాడు నాన్న. "ఓఁ పోతా! నేనెందుకు పోను?!" అన్నాడు చంటి. "మా నాన్నే!" అని మురిసిపోయింది బామ్మ.

తర్వాత ఒక రోజున చంటిగాడు నిద్రలేచేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఎవర్ని పిలిచినా పలికేలా లేరు. అమ్మ వంటగదిలో ఉంది. అప్పుడే ఏవేవో వంటలు చేసేస్తోంది. నాన్న పనివాళ్ళకు పనులు పురమాయిస్తున్నాడు. చంటిగాడు పూజగదిలో ఉన్న బామ్మ దగ్గర- కెళ్ళాడు- "బామ్మా! గడపలకు పచ్చగా పసుపు పూసి, ఎఱ్ఱగా కుంకుమ బొట్లు పెట్టారేంటి? గుమ్మాలకు ఆకుపచ్చ మామిడి ఆకులేంటి? స్తంభాలకు ఆ అరటి చెట్లేంటి? రంగురంగుల ఆ పూలేంటి? నల్లని ఆ పలక ఎవరికి? ఆ తెల్ల చొక్కాయి, నీలం నిక్కరు ఎవరికి? ఈ రోజు ఏం పండగ?" అంటూ సందేహాలవర్షం కురిపించాడు.

బామ్మ నవ్వింది- "అబ్బో! ఫరవాలేదే, చంటీ ! నీకు రంగులన్నీ తెలిసి పోయాయి, బళ్ళో చేరటానికి అర్హత వచ్చినట్లే! ఈ రోజు నువ్వు బళ్ళో చేరే పండగరా, చంటీ !" అంది.

ఆరోజు చంటి వెళ్ళి తల స్నానంచేసి, అమ్మ ఇచ్చిన కొత్తచొక్కా వేసుకుని అమ్మానాన్నలతోపాటు పీటలమీద కూర్చుని పూజ చేశాడు. అందరూ కలిసి వాడికి అక్షరాభ్యాసం చేశారు.

 అదే రోజున వాడు బడిలో చేరాడు. ఆ రోజున ఒకటోతరగతి పంతులుగారు పలకపైన 'ఓ న మః ' రాసిచ్చారు వాడికి. చంటిగాడన్నాడు “మానాన్న ఇంట్లో బియ్యంలో రాసేసారుగా వీటిని?!" అని. పంతులు గారు నవ్వి "ఇక మీదట వీటిని రోజూ తరగతిలో నీ అంతట నువ్వే రాయాలి, తెలుసా?" అన్నారు. బుధ్ధిగా తల ఊపాడు చంటి. "నువ్వు మా బళ్ళో చేరావు కదా, అందుకని ఇవాళ్ళ నీకు మేం ఏవో బహుమతులు ఇస్తాం. ఏమిటో‌ కనుక్కో!"అన్నారు పంతులుగారు. చంటి ఏవేవో వస్తువుల పేర్లు చెప్పాడు గానీ‌, అవేవీ కావన్నారు పిల్లలు నవ్వుతూ.


ఆరోజు సాయంకాలం బడి వదలగానే పంతులుగారు వచ్చి, ఐదు పండ్ల మొక్కలు తెచ్చి ఇచ్చాడు చంటికి. స్కూల్లో పిల్లల వయసును బట్టి, ఎవరిది ఎన్నో పుట్టినరోజైతే అయ్యవార్లు వాళ్ళకి ఆ రోజున అన్ని మొక్కలు బహుమతిగా ఇస్తారట. వాళ్ళు వాటిని ఎక్కడో ఒక చోట నాటి, శ్రద్ధగా పెంచాలట!

చంటిగాడు బామ్మని, అమ్మని ఊపిరి తిప్పుకోనివ్వక, ఆ మొక్కల్ని నాటేవరకూ గొడవ చేస్తూనే ఉన్నాడు. ఇంటికి నాలుగు మూలల్లోనూ నాలుగు మొక్కలు నాటారు. ఇక మరో బాదం మొక్క మాత్రం మిగిలింది. "దాన్ని పెరట్లో వంటగది బయట పెట్టండర్రా ! ఆకులు కోసుకుని విస్తరి కుట్టుకుని భోజనం చేయచ్చు"అంది బామ్మ.

ప్రతిరోజూ చంటిగాడు నిద్రలేవగానే వెళ్ళి ముందుగా బాదం మొక్క దగ్గర కూర్చొని ముఖం కడుక్కునేవాడు. ఆపైన ఇంటిచుట్టూ తిరిగి అన్ని మొక్కల్నీ చూసుకునేవాడు. వాటన్నింటికీ నీళ్ళు పోసి, ఆ తర్వాతగానీ తను స్నానం చేసేవాడుకాదు! అట్లా వాడు రెండో తరగతికి వచ్చేసరికి అయ్యవార్లు మరో ఆరు మొక్కలిచ్చారు. మూడో తరగతికి వచ్చేసరికి ఏడు మొక్కలు. నాలుగో తరగతిలో ఎనిమిది. ఐదులో తొమ్మిది మొక్కలు. అటుపైన వాడు హైస్కూలుకు పోవలసి వచ్చింది!

హైస్కూల్లో పిల్లలకు మొక్కలు ఇచ్చేవాళ్ళు కాదు. అయినా చంటిగాడి బామ్మ ఊరుకుంటేగా? ప్రతి సంవత్సరం వాడి పుట్టిన రోజుకి ఆమె తనంత తానుగా వాడికి మొక్కల బహుమతి ఇవ్వటం మొదలు పెట్టింది. అలా అలా చంటిగాడు పదో తరగతికి వచ్చేసరికి 95మొక్కలు, అదనంగా వాడి స్నేహితులు తెచ్చి ఇచ్చినవి 13. మొత్తం 108 మొక్కలతో 'చంటిగాడి పండ్ల తోట' తయారయింది!

మామిడి, సపోటా, జామ, దానిమ్మ, నిమ్మ, పనస, నారింజ, బత్తాయి ఇంకా రకరకాల అరటి పండ్లూ, కాయలతో కళకళలాడ పోతున్నది వాడి తోట. ఊళ్ళో ఎవ్వరికీ అంతమంచి తోటలేదు!

పదోతరగతి పరీక్షల తర్వాత పాఠశాల వార్షికోత్సవసభలో పెద్ద పంతులుగారు మాట్లాడుతూ "చంటి మా బళ్ళో చదవడం మాకెంతో గర్వకారణం. తనకు ఐదో ఏట లభించిన మొక్కనుండి పదో తరగతిలో వాళ్ళ బామ్మ ఇచ్చిన మొక్క వరకూ అన్ని మొక్కలనూ బ్రతికించి, తన పండ్లతోటలో అందంగా, నిండుగా నిల్పుకుని, పరిసరాల పరిరక్షణ కావిస్తున్న చిన్న రైతు- చంటి. అతన్ని కొంతసేపు తన తోట గురించి చెప్పమని కోరుతున్నాను" అన్నారు ఆప్యాయంగా.* 

 *జిల్లా అధికారులంతా చేరిన ఆసభలో చంటి లేచి నిలబడి ప్రసంగించాడు “ముందుగా మా చిన్నప్పటి బడిలోని అయ్యవార్లందరికీ, ఆ తర్వాత మా బామ్మగారికి, అమ్మానాన్నలకూ వందనాలు. సభికులందరికీ నమస్కారాలు! అయ్యవార్లూ, ఇంట్లో పెద్దలూ పిల్లలకు సహకరిస్తే ఏదైనా సాధింగలం. ప్రతి బడీ మా బడిలాగానూ, ప్రతి అయ్యవారూ మా అయ్యవార్లలాగాను ఉంటే దేశమే మారిపోతుంది. పరిసరాల కాలుష్యం పెరగదు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినదు. ఎవరికి కావలసిన ప్రాణవాయువు వాళ్ళ పరిసరాలలోనే తయారౌతుంది. అందరూ ఆరోగ్యంగా జీవించొచ్చు

నిజానికి ఈ సన్మానం జరగాల్సింది నాకు కాదు. నాకు మొట్టమొదటి బహుమతినిచ్చిన ఒకటో తరగతి అయ్యవారికి. స్కూల్లో చేరిన ప్రతి పిల్లవాని పుట్టినరోజు పండుగకూ ఐదేళ్ళైతే ఐదు , ఆరేళ్లైతే ఆరు మొక్కల చొప్పున ఇచ్చి ఇళ్ళలో పెంచమని కోరేవాళ్ళు. వాళ్ళు అలా నాకు ఇచ్చిన ఐదు మొక్కల్నీ ఆ రోజున నా బదులు మా బామ్మ, అమ్మ నాటారు. వాళ్లకి కృతజ్ఞుడిని.*

పలువురి ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదకారి ఔతున్న 

ఇప్పుడు మా బాదం చెట్టుకు పదేళ్ళు. మేం కావలసినన్ని బాదం పండ్లు తింటాం; బాదం ఆకుల విస్తళ్లలో ఫలహారాలు చేస్తాం. అరటి ఆకులు భోజనం చేయను వాడుకుంటాం. ఎంగిలి ఆకులను మా ఆవులు గేదెలు తింటాయి; మా దొడ్లో రాలిన ఆకులన్నీ చిమ్మి, గుంట త్రవ్వి, లోపల వేసి, మట్టికప్పితే గొప్ప 'పచ్చి రొట్ట ఎరువు ' తయారవుతుంది. మా పూలమొక్కలకూ, కూరపాదులకూ ఆ ఎరువునే వేస్తాం. మా తోటలో పండే కూరలు, ఆకుకూరలు, పండ్లు, పూలు- వేటికీ రసాయన ఎరువులు అవసరం కాలేదు.

మా వంట ఇంటి గుమ్మం ముందు మా బామ్మ నాటిన బాదంచెట్టు పెద్ద పెద్ద ఆకులతో కొమ్మలతో విస్తరించి ఉంది. తన వెడల్పాటి ఆకులను అడ్డుగా ఉంచి వంటగదిలోకి దుమ్ము ధూళి రాకుండా అడ్డుకుంటుంది అది. నేను నాలుగో తరగతిలో ఉండగానే, మరిన్ని మొక్కలు నాటటంకోసం మా పెరటి పక్క స్థలాన్ని కొనేశారు మానాన్నగారు. 108 చెట్లతో ఈరోజున మాతోట ఇంత అందంగా ఉందంటే, దానికి పెద్దల ప్రోత్సాహం, వాళ్ల సహాయ సహకారాలే కారణం. మా ఇంట్లో వాడే నీరంతా కాలువలద్వారా అన్ని చెట్లకూ మళ్ళేలా సిమెంటుకాలువలు కట్టించారు మానాన్నగారు. మా నూతి వద్ద పడ్డ ప్రతి నీటి- బొట్టూ ఏదో ఒక మొక్కకు అందవలసిందే! అందుకే పెద్దల సహకారం పిల్లలకు అవసరమని చెప్పాను.

ఇక, మా తోటలో కాసే పూలకోసం తుమ్మెదలు, పండ్లకోసం అనేక రకాల పక్షులు, వచ్చి చేరుతాయి. రోజూ మేం కోయిలల కుహూ రావాలతో నిద్రలేస్తాం, చిలుకల పాటలు వింటూ పనులు చేసుకుంటాం, కాకమ్మలు మేం పెట్టే అన్నపు మెతుకులకోసం కాచుకుంటాయి.

మేమంతా రోజూ‌ కనీసం ఒక్క గంట సేపైనా తోటపని చేస్తాం- అందువల్ల మా శరీరాలు గట్టిపడ్డాయి. ఆరోగ్యాలు బావున్నాయి. డెభ్భై ఏళ్ళ మా బామ్మ సైతం మాతో పాటు పనిచేస్తుంది. ఆ వయస్సులో సహజంగా వచ్చే వ్యాధులేవీ ఆవిడకు లేవు.

మేం తినటమే కాదు; మా చుట్టు పక్కలవాళ్ళకీ, మా బడి పంతుళ్ళకూ అందరికీ మా తోటలో పండిన కూరలు పంచి పెడతాం. చాలామంది మా నాన్నగారికి చెప్పారట- కూరగాయల్ని, పండ్లని పట్టణానికి పంపి అమ్మమని. అమ్మితే డబ్బు వస్తుంది- కాని, మేము కూరలు, పండ్లు, మొక్కలు బహుమతిగా ఇచ్చినపుడు మా స్నేహితుల ముఖాల్లో కనిపించే ఆనందం ఎన్నివేలు పెట్టికొంటే దొరుకుతుంది మాకు?

మా ఇంటి చుట్టూ చెట్లు ఉండటం వల్ల వేసవిలో మాకు ఎండ వేడి లేనే లేదు. మా ఇంట్లోకి దుమ్మే రాదు. సాయంకాలాల్లో మా తోటను చూసేందుకు అనేక మంది వస్తుంటారు. వాళ్ళను మేము ఉత్తచేతులతో పంపనే పంపం. మా ఇంటి బొండు మల్లెలకోసం వీధి వీధంతా ఎదురు- చూస్తుంటుంది. ఊరి గుళ్ళల్లో దేవుళ్ళకు మా ఇంటి పూలతో కట్టిన మాలలు అలంకరిస్తారు- ఇంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది? ఇంటి తోటవల్ల నేను పొందిన ఈ అనుభవం నా జీవన ధ్యేయాన్ని నిర్దేశించింది. నేను వ్యవసాయశాస్త్రం చదవాలనుకుంటున్నాను.

అందరికీ మరోసారి వందనాలు. నా కోరిక కాదనక, అంతా మా తోటకు వచ్చి అక్కడ పండిన మామిడి పండ్లు, పనస తొనలు తిని వెళ్ళమని మనవి " అని ముగించాడు చంటి.


అంతా చప్పట్లు కొట్టారు. సభకు విచ్చేసిన కలెక్టరుగారు చంటిని అభినందిస్తూ అప్పటికప్పుడు వాడికి 'బాల రైతు' బిరుదు, బంగారు పతకమూ బహుమతిగా ఇచ్చారు!


*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

(Source: Telegram group : మనం - మన ఆధ్యాత్మికత )

మార్ష్ మల్లో సిద్ధాంతం

నిజంగా ఓర్పు అనేది  పరీక్ష. 

ఒక పాఠశాలలో క్లాస్ టీచర్ తన క్లాస్ లోని పిల్లలందరికీ కమ్మని మిఠాయి పంచి ఒక విచిత్రమైన షరతు పెట్టారు. 

ఆయన "మరో పది నిమిషాలవరకు మీరందరూ ఈ మిఠాయి తినకూడదు" అని చెప్పి తరగతి గది నుంచి వెళ్లిపోయారు. 

ఆ తరగతి గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది. పిల్లలందరూ తమ ముందు ఉన్న మిఠాయి వైపు చూస్తున్నారు. 

గడిచే ప్రతి క్షణం వారి ఆత్రుతని అదుపులో ఉంచుకోవడం చాల కష్టం గా  ఉంది. 


పది నిమిషాల తర్వాత టీచర్ ఆ క్లాస్ రూమ్ లో కి ప్రవేశించారు. పరిస్థితిని సమీక్షించారు. 

ఆ తరగతి గదిలో మిఠాయిలు తినని పిల్లలు ఏడుగురు ఉన్నారని గుర్తించారు. 

మిగిలిన పిల్లలందరూ మిఠాయి తినేసి దాని రంగు, రుచి గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు.

 ఉపాద్యాయుడు తన డైరీ లో ఈ ఏడుగురు పిల్లల పేర్లను రహస్యంగా నమోదు చేసుకొని తాను చెప్పాల్సిన పాఠం చెప్పి వెళ్లిపోయారు. 

ఆ ఉపాధ్యాయుడి పేరే "వాల్టర్ మిషెల్. " 

కొన్నేళ్ల తర్వాత వాల్టర్ తన డైరీ తెరిచి ఆ ఏడుగురు పిల్లల పేర్లను బయటికి తీసి వారు ఇప్పుడు ఎం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నాడు. 

ఆ ఏడుగురు చిన్నారులు తమ తమ రంగాల్లో మంచి విజయాలు సాధించారని తెలుసుకున్నాడు. 

అదే తరగతికి చెందిన మిగిలిన విద్యార్థులు గురించి కూడా ఆరా తీశారు. వారిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని, కొంతమంది ఆర్ధికంగా, సామాజికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నారని కూడా తెలుసుకున్నాడు. 

వాల్టర్  తన పరిశోధనను ఈ ఒక్క వాక్యం లో ముగించారు. 

"కేవలం ఒక్క పది నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు " అనేదే ఆ వాక్యం. 

ప్రపంచ ప్రఖ్యాతిని పొందింది ఈ పరిశోధన. 

ఉపాధ్యాయుడు వాల్టర్ పిల్లలకు ఇచ్చిన మిఠాయి "మార్ష్ మెల్లో " అవడం వల్ల  ఇది "మార్ష్ మెల్లో  సిద్ధాంతం" అని పిలువబడింది. 

ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచం లో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్యలక్షణాలతో పాటుగా 'ఓర్పు'ని కూడా కలిగి ఉంటారు. 

ఓర్పు ఒక వ్యక్తి యొక్క సహన శక్తిని పెంచుతుంది. కాబట్టి అతను ప్రతికూల పరిస్థితులలో కూడా నిరుత్సాహపడడు. తనకి తానుగా ప్రేరేపించుకుంటూ విజయవంతమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుంటాడు. 

Wednesday, 6 July 2022

మూడు సలహాలు..కథ

💐💐💐💐💐💐💐
ఒకసారి ఓ వేటగాడు ఒక అడవిలోకి పోయి, అక్కడ వల పన్నాడు. తను ఓ మూలగా నక్కి కూర్చున్నాడు- 'ఏమైనా పక్షులో, జంతువులో అటుగా వచ్చి వలలో చిక్కకపోతాయా' అని.
అంతలో అటువైపుకు వచ్చిందొక బుజ్జి పిట్ట. వస్తూ వస్తూనే అది కాస్తా వలలో చిక్కుకున్నది. చూసేందుకది చిన్నదే, కానీ దాని తెలివి అమోఘం. అది ఏమీ కంగారు పడకుండా వలలో అలాగే కూర్చున్నది.
వేటగాడు సంతోషంగా దాని దగ్గరికి వచ్చి పట్టుకున్నాడు. "బుజ్జి పిట్ట బలే రుచిగా ఉంటుంది" అనుకున్నాడు. అయితే వాడు దాన్ని చంపబోగానే, బుజ్జి పిట్ట వాడితో మాట్లాడింది- "వేటగాడా! ఓ సారి నామాట విను. నేను ఎంత చిట్టి పిట్టనంటే, నన్ను చంపి తిన్నంత మాత్రాన నీ ఆకలి చల్లారదు; నీ కడుపు నిండదు. దానికంటే నయం, నువ్వు నన్ను ఊరికే వదిలెయ్యి- అలా వదిలేస్తే, బదులుగా నేను నీకు అమూల్యమైన సలహాలు మూడు ఇస్తాను. అవి నీకు ఎనలేని మేలు చేస్తాయి. మొదటి సలహాను నేను ఇక్కడినుండే, నీ చేతిమీదే కూర్చొని- ఇస్తాను. రెండవదాన్ని నేను ఈ చెట్టు కొమ్మమీద కూర్చొని ఇస్తాను. మూడో సలహాను నేను ఆ చెట్టు మీద వాలి ఇస్తాను" అన్నది.
వేటగాడు ఒక్క క్షణం ఆలోచించాడు- "నిజమే, ఈ‌ పిట్ట చాలా చిన్నది. దీన్ని తింటే కడుపేమీ నిండదు. దాని బదులు, ఇదేదో మంచి సలహాలు ఏవో ఇస్తానన్నది కదా, అవి తీసుకుంటే సరి. వాటి వల్ల నాకు ఎనలేని మేలేదో కలుగుతుందట కూడా! మరింకేమి?!" అని, పిట్టను వలనుండి తప్పించి చేతిలో పట్టుకున్నాడు.
పిట్ట అతనికి తన మొదటి సలహాను ఇచ్చింది: "ఎప్పుడైనాగానీ-సంభవం కాని మాటలు ఎవరు చెప్పినా సరే- నమ్మద్దు" అని.
"సరేలే" అన్నాడు వేటగాడు.
సలహా ఇచ్చేసాక పిట్ట ఎగిరి వెళ్ళి ఆ చెట్టు కొమ్మ మీద కూర్చున్నది. వేటగాడు ఇంకా మొదటి సలహా గురించి ఆలోచిస్తూండగానేతన రెండో సలహాను అందించింది: "జరిగిపోయినది ఏదైనా సరే- దాన్ని గురించి బాధపడద్దు" అని.
వేటగాడు సరే నన్నాడు, పరధ్యానంలోనే.
పక్షి వెంటనే అక్కడినుండి ఎగిరి వెళ్ళి ప్రక్కనున్న చెట్టు పైన వాలి, చెప్పింది- "చూడబ్బీ! నా పొట్టలో వంద గ్రాముల బంగారు ముక్క ఒకటి ఉంది. నువ్వు గనక దాన్ని దొరకపుచ్చుకొని ఉంటే, నువ్వొక్కడివే కాదు- నీ తర్వాత పది తరాల వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతికి పోయేవాళ్ళు. నాకు నీ మీద ఎంత జాలిగా ఉందో చెప్పలేను- నువ్వు తొందరపడి నన్ను వదిలివెయ్యటం వల్ల, నీకు అందబోయిన సంపద ఆసాంతం పోయింది!" అని.
వేటగాడు నిర్ఘాంతపోయాడు . బాధ పడ్డాడు. "నువ్వు నన్ను మోసం చేశావు" అని మొత్తుకున్నాడు.
పక్షి నవ్వి, వేటగాడితో‌అన్నది- "చూడు, నీకు నేను ఇచ్చిన సలహాలు ఇంకా సరిగ్గా అర్థం అయినట్లు లేదు- 'జరిగిపోయింది ఏదైనా సరే, దాన్ని గురించి బాధ పడద్దు; ఎందుకంటే అట్లా బాధపడటం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు' అని చెప్పాను. మరి, నువ్వు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు?
అంతేకాదు- 'సంభవం కాని మాటలు ఎవరు చెప్పినా నమ్మద్దు' అని చెప్పాను. ఇందాకే కదా, నువ్వు నన్ను పట్టుకున్నది?- నా బరువు వంద గ్రాములు ఉంటే నీకు తెలీకపోయేదా? ఇంత చిన్న నా కడుపులో‌ వంద గ్రాముల బంగారం అసలు ఎట్లా చేరుకుంటుంది? అసంభవం కదా; మరి దాన్ని నమ్మకూడదు కదా?" అన్నది.
వేటగాడు సిగ్గు పడ్డాడు. "నిజమే. మంచి మాటలు విన్నంత మాత్రాన అవి మన ఆచరణలోకి వచ్చేస్తాయని లేదు. మంచిని ఆచరణలో పెట్టేందుకు కూడా‌ ప్రత్యేకించి ప్రయత్నించాలి. నువ్విచ్చిన సలహాలను అమలు చేసేందుకు గట్టిగా ప్రయత్నిసాను ఇకమీద" అన్నాడు. "మరి నువ్విచ్చే మూడో సలహా ఏంటి?" ఉత్సాహంగా అడిగాడు పిట్టను.
"మంచి సలహాలు వినగానే వాటిని ఆచరణలోకి తెచ్చేసుకోవాలి-లేకపోతే ఇక సలహాలు రావు" అని చెప్పి తుర్రున ఎగిరిపోయింది పిట్ట.

Friday, 1 April 2022

ఆహారంలో ఐదు విధాలైన దోషాలు

 ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయట


1.  అర్ధ దోషం ,

2.  నిమిత్త దోషం.             

3.  స్ధాన దోషం

4.  గుణ దోషం ,  

5.  సంస్కార దోషం.


ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు. 


 అర్ధ దోషం:

ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.

భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. గదిలోనే  శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. 

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.

తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.  

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.

వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. 

శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి!  యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు.

విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో , తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం. 

మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. 


నిమిత్త దోషం:

 మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.

వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు.

అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి. 

భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో  కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే  వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు.

అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు?  అని అనుకొన్నది.

ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు

'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. 

నా స్వీయ బుధ్ధిని ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను 

ఇప్పుడు పవిత్రుడినైనాను.

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది  తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి *'నిమిత్త దోషం '* ఏర్పడుతోంది.


 స్ధాన దోషం:

స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటll కూడా పాడైపోతుంది.

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు.

దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని తల్లి సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు తల్లి వైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో 

కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు. 

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి 


గుణ దోషం

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది...


                              🍁🍁🍁🍁